తొలగించండి..లేదా ఆపెయ్యండి!!

ప్రస్తుత సమాజంలో అధిక శాతం ప్రజలు డబ్బు కోసం గడ్డి తినడానికి సైతం ఆలోచించడం లేదు.కష్టపడి సంపాదించడం కన్నా ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కడం వారికి సులభంగా అనిపిస్తుంది.

 High Court Lawyers Complaint On Gopala Gopala Movie-TeluguStop.com

ఇవన్ని పక్కన పెడితే సంక్రాంతి కానుకగా విడుదలైన పవన్ కల్యాణ్ -వెంకీ ముల్తీ స్టారర్ చిత్రంపై సాక్షాత్తూ తెలంగాణా న్యాయవాదులే పెదవి విరుస్తున్నారు.అసలేం జరిగిందంటే తెలంగాణ న్యాయవాదుల క్యాలెండరును ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులకు ఇళ్లస్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.న్యాయవాదుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే బడ్జెట్‌లో రూ.100 కోట్లు తెలిపారు.ఇక ఆ తదనంతరం జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల చిత్రం పైన ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మంత్రికి ఫిర్యాదు చేశారు.ఈ చిత్రంలో తమను కించపరిచే సన్నివేశాలున్నాయన్నారు.

దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.వీలుంటే ఆ సన్నివేశాలను తొలగించాలని, లేదంటే సినిమానైనా ఆపెయ్యాలి అని వారు మంత్రిగారికి తెలిపారు.

దేనీపై మంత్రి సైతం ఆలోచిస్తానని చెప్పినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube