తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకి జీతం కట్ - కేసిఆర్

మీరు చదివే ఉంటారు .ఈమధ్యే అస్సాం ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

 Telangana Govt To Reduce Salaries Of Employees Who Neglect Parents-TeluguStop.com

తల్లిదండ్రులను చూసుకోకుండా, గాలికి వదిలేసే ఉద్యోగుల జీతాలు కట్ చేసి, అ డబ్బు తల్లిదండ్రులకి ఇస్తామని.దేశవ్యాప్తంగా ప్రజలు ఈ కొత్త నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు.

ఇప్పుడు ఇదే ఐడియాని తెలంగాణలో కూడా అమలు పరిచే ఆలోచనలో ఉందట కేసిఆర్ ప్రభుత్వం.అయితే ఓ నిర్ణయం తీసుకునే ముందు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతారట.

ఈ విషయం మీద టీఆర్ఎస్ ఎమ్మెల్సి, ఛీఫ్ విప్ పి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ “ముఖ్యమంత్రి గారికి ఈ ఐడియా బాగా నచ్చింది.దాంతో అస్సాం లాంటి “లా” ని తెలంగాణలో కూడా తీసుకొచ్చే అవకాశాలపై అలోచించమని అధికారులకి సూచించారు.గవర్నమెంటు ఉద్యోగులు తమ తల్లిదండ్రులని పట్టించుకోకపోతే ప్రభుత్వమే వారికి ఉద్యోగుల జీతం నుంచి డబ్బులు ఇప్పించేలా ప్లాన్ చేయాలని, కాని నిర్ణయానికి ముందు ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలని ఆయన చెప్పారు” అంటూ కేసిఆర్ ఆలోచనను బయటపెట్టారు.

ఇదేదో అస్సాంని చూడగానే చర్చించిన ఆంశం కాదు లేండి.తమని పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల గురించి చాలామంది తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నారట.అందుకే ఈ ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube