ఇల్లు కట్టిస్తా..గృహప్రవేశానికి వస్తా!!!

పేదవారిపై వారాల జల్లు కురిపించాడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్.ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న అర్హులైన ప్రతిఒక్కరికీ నాలుగు నెలల్లో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానని ఆయన ప్రకటన చేశాడు.

 Kcr Visits Slum In Warangal!!-TeluguStop.com

గురువారం రాత్రి నగరంలోని గిరిప్రసాద్ కాలనీ, లక్ష్మిపురం, సాకరాసికుంట కాలనీలలో ఆయన పర్యటించారు.ఈసంధర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు నాలుగు నెలల్లోనే పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానని, గృహప్రవేశానికి కూడా తానే వస్తానని.

అప్పుడు తనకు కల్లుతో పాటు మంచి దావత్ ఇవ్వాలన్నారు.అయితే గుడుంబాతో మాత్రం కాదన్నారు.

పదిరోజుల్లోనే ఈదిశగా పనులను ప్రారంభించి నాలుగు నెలల్లో నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.ఇందుకు ఆయా కాలనీవాసులు సహకరించాలని కోరారు.

ప్రజలే తనకు దేవుళ్లని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతానన్నారు.ఇక నుండి మురికి కాలనీలన్నింటినీ ఆదర్శ కాలనీలుగా మారుస్తానని తెలిపారు.

డబుల్ బెడ్‌రూంతోపాటు అటాచ్ బాత్‌రూం నిర్మించి హాల్, కిచెన్‌తో కలిపి రిజిస్ట్రేషన్ మరీ అందిస్తామన్నారు.ఇల్లు, జాగలేని పేదవాడు ఉండకూడదనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.

సిఎం పర్యటనతో కాలనీవాసుల్లో ఉత్సాహం కనిపించింది.మరి వారి ఆశలకు కేసీఆర్ ప్రాణం పోస్తాడో.

లేక ఆశలపై నీళ్ళు జల్లుతాడో చూడాలి.ఏది ఏమైనా ప్రజల వద్దకే పాలన అన్న పదానికి మరోసారి కేసీఆర్ నిర్వచనం చూపించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube