డిల్లీ లో కెసిఆర్ ధర్నా !

తెలంగాణా రాష్ట్రాన్ని ఉద్యమ రూపం లో కొన్ని వందల మంది బలిదనాలతో సాధించుకున్న సంగతి తెలిసిందే.అలుపు ఎరగని ఉద్యమ నేతగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్.

 Kcr Dharna In Delhi-TeluguStop.com

మరొక సారి ఆయన సమారా శంఖం పూరించే రోజు రాబోతున్నట్టు తెలుస్తోంది.తెలంగాణా రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరి సరిగ్గా లేదు అనీ వారు ఈ రాష్ట్రం పట్ల వివక్షతో ఉన్నారు అనీ కెసిఆర్ మండి పడుతున్నారు.

డిల్లీ లోని పాలకులు తెలంగాణా వైపు చూస్తున్న చిన్న చూపు ని అక్కడే డిల్లీ లోనే రోడ్డు ఎక్కి మరీ ప్రశ్నించడం కోసం సిద్ధం అవుతున్నారు ఆయన.రాష్ట్రంలోని న్యాయవాదులు మొత్తం ఐక్యంగా గళమెత్తి ఉద్యమిస్తున్నప్పటికీ.హైకోర్టు విభజన అనే అంశాన్ని పట్టించుకోకుండా.తెలంగాణ ప్రయోజనాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరిని కేసీఆర్‌ ధర్నా ద్వారా ఎండగట్టడానికి సిద్ధం అవుతున్నారు.

హైకోర్టులో ఇటీవలి నియామకాలు కొత్త రగడకు దారి తీసిన సంగతి అందరికీ తెలిసిందే.దీని పర్యవసానంగా న్యాయవాదులు, అధికారులు మొత్తం కొన్నాళ్లుగా తీవ్ర నిరసనలు తెలియజేస్తున్నారు.

ఈ పోరాటం మరింత ఉధృత రూపం దాలుస్తూ డిల్లీ వెళ్ళ బోతోంది.కేంద్రం వైఖరి తన రాష్ట్రానికి అన్యాయం చేస్తుండడం తో స్వయంగా డిల్లీ చేరుకొని ధర్నా చేసి అయినా రాష్ట్రానికి ప్రత్యేకంగా హై కోర్టు తేవాలి అన్నది ఆయన సంకల్పం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube