బాబుకు కేసీఆర్ - మోడీ క‌లిసి దెబ్బేస్తారా ..!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌ర్వాత తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో చాలా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.మోడీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టేసిన చంద్ర‌బాబు మోడీకి ఈ స‌ల‌హా నేనే ఇచ్చాన‌ని చెప్పారు.

 Telangana Cm Kcr Join The Nda Alliance..?-TeluguStop.com

ఆ నిర్ణ‌యంతో సామాన్యులు తీవ్ర ఇక్క‌ట్ల‌కు గుర‌వుతుండ‌డంతో త‌ర్వాత కాస్త చంద్ర‌బాబు ఈ నిర్ణ‌యంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ విష‌యానికి వ‌స్తే దీనిపై ఆచితూచి స్పందించిన కేసీఆర్ ముందుగా మోడీ నిర్ణ‌యంపై ఫైర్ అయినా త‌ర్వాత ఢిల్లీ వెళ్లి మోడీని క‌లిశాక మాత్రం కేసీఆర్ మాట మారిపోయింది.

ప్ర‌తి రోజు మోడీకి అనుకూలంగా కేసీఆర్ మాట్లాడుతున్నారు.ఓ ర‌కంగా చెప్పాలంటే కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖా మంత్రిగా, మోడీకి డ‌ప్పుకొట్టే మంత్రిగా కేసీఆర్ మారిపోయార‌న్న టాక్ కూడా వ‌చ్చేసింది.

తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సైతం కేసీఆర్ మోడీ / కేంద్ర ప్ర‌భుత్వానికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.కేసీఆర్ మోడీని ఇంత‌లా ఆకాశానికి ఎత్తేయ‌డం వెన‌క కేసీఆర్ అడుగులు ఎన్డీయే వైపు ప‌డుతున్నాయ‌ని తెలుస్తోంది.

కొద్ది నెల‌ల్లో అయినా లేదా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అయినా కేసీఆర్ ఎన్డీయేతో జ‌ట్టుక‌డ‌తార‌న్న వార్త‌లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా విజ‌యం సాధిస్తార‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పూర్తి మెజార్టీ ద‌క్కుతుంద‌న్న గ్యారెంటీ లేని బీజేపీ చాలా ప్రాంతీయ పార్టీల‌తో పొత్తుకు రెడీ అయిపోతోంది.ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌-మోడీ మ‌ధ్య ఇప్ప‌టికే ఇదే అంశంపై చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రి కేసీఆర్ ఎన్డీయేలో భాగం అయితే చంద్ర‌బాబు ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.

ఏపీలో బీజేపీ వ‌ర్సెస్ టీడీపీ పోరు జ‌రుగుతోంది.

రెండు పార్టీల మ‌ధ్య పూర్తి స్థాయిలో స‌ఖ్య‌త వాతావ‌ర‌ణం అయితే క‌న‌ప‌డ‌డం లేదు.ఈ క్ర‌మంలో కేసీఆర్‌ను మోడీ ఎన్డీయేలో చేర్చుకుంటే చంద్ర‌బాబుకు ప్ర‌యారిటీ త‌గ్గుతుంద‌న్న వాద‌న‌లు కూడా ఉన్నాయి.

మ‌రి ఈ టైంలో చంద్ర‌బాబు డెసిష‌న్ ఎలా ఉంటుంది అన్న‌దే పెద్ద స‌స్పెన్స్‌గా ఉంది.ఈ ప్ర‌శ్న‌ల‌కు కొద్ది రోజుల్లోనే క్లారిటీ వ‌చ్చే సూచ‌న‌లు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube