మంత్రుల‌కు కేసీఆర్ ఫుల్ క్లాస్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కోపం వ‌స్తే? అది కూడా మంత్రుల‌పైనే ఆగ్ర‌హిస్తే.? ఎలా ఉంటుంది? సాక్షాత్తూ.ఉగ్ర న‌ర‌సింహావ‌తారం క‌ళ్ల ముందే క‌నిపించిన‌ట్టు ఉంటుంది.ఇప్పుడు ఇదే ఫీల‌వుతున్నా తెలంగాణ మంత్రులు! నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూల్‌గా ఉన్న కేసీఆర్ ఒక్క‌సారిగా సీరియ‌స్ అయ్యారు.

 Telangana Cm Kcr Fires On Ministers-TeluguStop.com

అది కూడా త‌న మంత్రి వ‌ర్గంపైనే! ఊహించ‌ని ఈ ప‌రిణామంతో మంత్రులు ఒక్క‌సారిగా ఖంగుతిన్నారు.నిజానికి మంత్రివ‌ర్గంలోని వారంతా కేసీఆర్‌కి అత్యంత స‌న్నిహితులు, ఆయ‌న దృష్టిలో మంచి వాళ్లే! అయినా కూడా కేసీఆర్ ఎందుకు ఇంతలా సీరియ‌స్ అయ్యారు.

మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగే విధంగా ఆయ‌న ఎందుకు ఫైర‌య్యారు? ఇప్పుడు ఇదంతా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఉద్య‌మ నేప‌థ్యంలో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌కి ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున సానుభూతి ఉంది.

ఆయ‌నంటే.గొప్ప గౌర‌వం కూడా ఉంది.

అయితే, కొన్నాళ్లుగా ఆయ‌న పాల‌న‌పైనా… ఆయ‌న చేప‌డుతున్న ప‌థ‌కాల‌పైనా కొన్ని వ‌ర్గాలు ప‌నిగ‌ట్టుకుని యాంటీ ప్ర‌చారం చేస్తున్నాయి.ముఖ్యంగా ఉద్య‌మ స‌మ‌యంలో త‌న‌తో భుజం భుజం రాసుకుని తిరిగిన కోదండ‌రాం వంటి నేత‌లు సైతం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మాలు చేప‌డుతున్నారు.

వాస్త‌వానికి తెలంగాణ‌లో త‌న‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రూ లేర‌ని, ఉండ‌రాద‌ని నిర్ణ‌యించుకున్న కేసీఆర్‌కు ఈ ప‌రిణామం మింగుడు ప‌డ‌డంలేదు.

దీనికితోడు వామ‌ప‌క్షాల పాద‌యాత్ర‌లు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స‌వాళ్లు.

కూడా కేసీఆర్‌కి ఒక‌ర‌కంగా పంటి కింద రాళ్ల‌లా మారాయి.ఈ నేప‌థ్యంలో వీటిని బ‌లంగా తిప్పికొట్టాల్సిన మంత్రులు మాత్రంమౌనంగా ఉంటున్నారు.

అయితే గియితే.ఒక్క కేటీఆర్‌, హ‌రీష్‌రావు, క‌విత‌లు త‌ప్ప ఎవ‌రూ ప్ర‌భుత్వ ప‌క్షాన నిల‌బ‌డి.

విప‌క్షంపై ఎదురు దాడి చేయ‌డం లేదు.ఈ క్ర‌మంలో ఫుల్ ఫైరైన కేసీఆర్ మంత్రుల‌కు క్లాస్ పీకార‌ని తెలిసింది.

మీరు అనుస‌రిస్తున్న వైఖ‌రి మారాలి.విప‌న‌క్షాలు పెద్ద ఎత్తున మ‌న‌మీద బుర‌ద జ‌ల్లుతుంటే.

మీరేం చేస్తున్నారు? అని వాళ్ల‌ని నిల‌దీసిన‌ట్టు తెలిసింది.

అంతేకాకుండా ప్ర‌భుత్వానికి సంబంధించిన కీలక స‌మాచారం సైతం ఎలా లీక‌వుతోంది? అనివాళ్ల‌ని నిల‌దీసిన‌ట్టు తెలుస్తోంది.గ‌తానికి భిన్నంగా కేసీఆర్ ఈవిధంగా క్లాస్ పీకేస‌రికి మంత్రులు ఖిన్నుల‌య్యారు.మ‌రోప‌క్క అధికారుల‌ను కూడా కేసీఆర్ వ‌దిలిపెట్ట‌లేదు.వాళ్లు కూడా ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కేసీఆర్ ఫైర‌య్యారు.దీంతో ఈ ప‌రిణామం ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ‌కుదారితీస్తోంది.

మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిణామాలు కేసీఆర్‌కి నిద్ర‌పోనివ్వ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.మ‌రి రాబోయే రోజుల్లో కేసీఆర్ ఇంకెలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube