స్కూల్ టీచర్లు స్టూడెంట్స్ తో సంబంధం పెట్టుకోవడం గురించి ఎన్నోసార్లు చదివాం మనం.టీచర్ స్టూడెంట్ ప్రేమలో పడ్డారని, లేచిపోయి పెళ్ళి చేసుకున్నారని వారానికి ఒక వార్త అయినా చూస్తుంటాం.
టీచర్ ని స్టూడెంట్ మానభంగం చేసినట్టు, స్టూడెంట్ ని టీచర్ మానభంగం చేసినట్టు, ఇలాంటి ఘోరమైన వార్తలు కూడా కామన్ అయిపోయాయి.ఇప్పుడు మీరు చదవబోతున్న వార్త కూడా కొంచెం అలాంటిది కాని దీంట్లో ఓ డిఫరెంట్ యాంగిల్ ఉంది.
ఇక్కడే టీచర్ – స్టూడెంట్ ఇద్దరు అమ్మాయిలే.
వివరాల్లోకి వెళితే ఇంగ్లాండ్ లోని ఎస్సెక్స్ నగరంలో ఒక స్కూలు టీచర్ గా పనిచేసేది సారా బాటన్.
స్కూలులోని డ్రామా అండ్ డ్యాన్స్ డిపార్ట్మెంట్ కి ఈవిడే హెడ్.ఆ విద్యలు నేర్పుతున్నప్పుడే ఒక స్టూడెంట్ తో బాగా క్లోజ్ అయిపొయింది సారా.
ఆ ఫ్రెండ్ షిప్ మెల్లిగా కొత్త పుంతలు తొక్కింది.కొన్నిరోజుల తరువాత ఫిజికల్ గా ఆ అమ్మాయిని ఆకర్షించే ఎత్తులు వేసిందట సారా.
తనతో ఫిజికల్ రిలేషన్ షిప్ పెట్టుకోవాలని, ఎవరికీ చెప్పను అని బాగా ప్రోత్సహించిందట.ఈ విషయం స్కూల్ స్టాఫ్ లో కొందరికి తెలిసిపోయింది.
దాంతో సారాని సహాటీచర్లు ఇలాంటి పనులు చేయవద్దు అని, నీతో పాటు అమ్మాయి పరువు కూడా పోతుంది అని బుద్ధి చెప్పడానికి ఎంత ప్రయత్నించిన వినలేదు సారా.
ఆరోజు తన కారులో ఆ అమ్మాయిని కాస్త దూరప్రాంతానికి తీసుకెళ్ళింది సారా.
తన కారులోనే ఆమెతో శృంగారం చేసిందట.అంతే కాదు, ఆ పని చేస్తూ ఫోటోలు తీసింది.
అక్కడితో ఆగకుండా, ఆ ఫోటోలను స్కూల్ లో ఇతర టీచర్స్ కి చూపెట్టి, అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు గొప్పలు పోయింది.ఆ ఫోటోలు బయటపడ్డాయి.
విషయం పెద్దగా అయ్యింది.తల్లిదండ్రులు వచ్చారు.
స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు.టీచర్ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని పట్టుబట్టారు.
టీనేజ్ అమ్మాయిని బలవంతం చేసిందని, న్యాయశాస్త్రానికి వ్యతిరేకంగా ఫిజికల్ సంబంధం పెట్టుకుందని ఆమెపై ఆరోపణలు పడ్డాయి.ఇదే స్థానంలో పురుషుడు ఉండుంటే రేప్ కేసులో బుక్ అయ్యేవాడు అనుకోండి.మొత్తానికి ఆ టీచర్ మీద ఓ పెద్ద శిక్షే పడింది.2022 దాకా ఆమెని టీచింగ్ ప్రొఫెషన్ నుంచి బ్యాన్ చేసారు.