ప్రత్యేక హోదా కోసం ఎవరెక్కువ పోరాడుతారు?

పార్లమెంటు శీతా కాల సమావేశాలు ప్రారంభం కావడంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం తెర మీదికి వచ్చింది.ప్రత్యేక ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నా దాన్ని సాధించి తీరుతామని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నమ్మబలుకుతున్నాయి.

 Tdp, Ysrcp Gearing Up To Fight For Special Status In Parliament-TeluguStop.com

కాంగ్రెసుకు పార్లమెంటులో స్థానం లేదు కాబట్టి అక్కడ పోరాటం చేయగలిగేది టీడీపీ, వైకాపా మాత్రమే.బెజేపీ ఎంపీలు గమ్మున ఉంటారు తప్ప ఏమీ మాట్లాడారు.

హోదా గురించి ఎవరు గట్టిగా పోరాటం చేస్తారు? అనేది ఇప్పుడు చర్చగా ఉంది.పార్లమెంటు సమావేశాలకు ముందు అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించారు.

దీనిలో హోదా గురించి, విభజన చట్టంలోని అంశాలు అమలు చేయని విషయం ప్రస్తావించానని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు.ప్రత్యేక హోదా పై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరపాలని తాము పట్టుపదతామని వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.

కానీ హోదా పై చర్చకు అనుమతి ఇవ్వకపోవచ్చు.హోదా ఇవ్వడం కుదరదని చెప్పినప్పుడు చర్చకు ఎందుకు అనుమతిస్తారు? అది జరగని పని.వైకాపా దీన్ని సభలో ఎలా ప్రస్తావిస్తుందో చూడాలి.డిసెంబరు 7వ తేదీన దిల్లీలో ఒక రోజు దీక్ష చేస్తామని ప్రత్యేక హోదా సాధన సమాఖ్య గౌరవ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube