క‌డ‌ప టీడీపీ గెలుపు వెన‌క ఎన్ని కోట్లో తెలుసా..!

క‌డ‌ప జిల్లాలో వైసీపీకి బ‌లం ఉందిచ బ‌లగం ఉంది, మంచి ప‌ట్టుంది.కానీ అక్క‌డ వైసీపీ అభ్య‌ర్థి వైఎస్‌.

 Tdp Spent 125crores In Kadapa..?-TeluguStop.com

వివేకానంద‌రెడ్డి ఓడిపోయారు.వైఎస్ ఫ్యామిలీకి గ‌త 40 యేళ్లుగా కంచుకోట‌గా ఉన్న క‌డ‌ప‌లో ఆ ఫ్యామిలీకి చెందిన వ్య‌క్తి, అది కూడా జ‌గ‌న్ సొంత బాబాయ్ వైఎస్‌.

వివేక ఓడిపోవ‌డం రాజ‌కీయంగా పెద్ సంచ‌ల‌నంగా మారింది.గ‌తంలో విశాఖ‌ప‌ట్నం నుంచి వైఎస్‌.

జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా అది వైఎస్ ఫ్యామిలీకి ప‌ట్టున్న ప్రాంతం కాదు.కానీ క‌డ‌ప అంటే వైఎస్ ఫ్యామిలీ…వైఎస్ ఫ్యామిలీ అంటే క‌డ‌ప అన్న నానుడి గ‌త 40 యేళ్లుగా అక్క‌డ కొన‌సాగుతోంది.

అంత కంచుకోట‌లా ఉన్న క‌డ‌ప‌లో ఆ ఫ్యామిలీకి చెందిన వివేక ఓట‌మి వైఎస్ అభిమానుల‌తో పాటు వైసీపీ అభిమానుల‌ను కూడా తీవ్రంగా క‌ల‌చివేస్తోంది.తెర‌పైకి వైఎస్ ఫ్యామిలీ ఓడిన‌ట్టే క‌నిపిస్తోంది.

కానీ తెర‌వెన‌క జ‌రిగిన తంతు చూస్తూనే ఈ గెలుపు కోసం టీడీపీ ఎన్ని ర‌కాల స్కెచ్‌లు వేసిందో…ఎలా అధికార దుర్వినియోగం చేసిందో…? కోట్లాది రూపాయ‌ల డ‌బ్బును ఎలా ఖ‌ర్చు చేసిందో చూస్తే టీడీపీ గెలుపు నిజంగా ఓ గెలుపేనా ? అన్న డౌట్లు రాక‌మాన‌వు.

ఇక్క‌డ సాంకేతికంగా టీడీపీ గెలిచినా.

అది బ‌లుపు గెలుపు కాదు.వాపు గెలుపుగానే లెక్క‌క‌ట్టాలి.

ఇక్క‌డ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువుగా మొగ్గు ఉంది.కానీ తాజా ఫ‌లితాల్లో చూస్తే టీడీపీకి 433 ఓట్లు వ‌స్తే వైసీపీకి 399 ఓట్లు వ‌చ్చాయి.

ఫ‌లితంగా టీడీపీ అభ్య‌ర్థి బీటెక్ ర‌వి 34 ఓట్ల‌తో విజ‌యం సాధించిన‌ట్ల‌య్యింది.వైఎస్ ఫ్యామిలీని ఎలాగైనా ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న చంద్ర‌బాబు అండ్ టీడీపీ నాయ‌కులు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు.

త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చే ఓటర్ల‌తో 15 రోజులుగా పెద్ద ఎత్తున శిబిరం ఏర్పాటు చేశారు.ఇక ఎంపీ సీఎం ర‌మేష్‌, ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాస‌రావు గ‌త నాలుగు నెల‌లుగా ఇత‌ర పార్టీల‌కు చెందిన స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌ను పెద్ద ఎత్తున ప్ర‌లోభాల‌కు గురి చేసి త‌మ వైపున‌కు తిప్పుకున్నారు.

ఇక వైసీపీ ఆరోప‌ణ‌ల ప్ర‌కారం కొంద‌రితో ఖాళీ బాండ్ పేప‌ర్ల మీద సంత‌కాలు కూడా చేయించుకున్నార‌ట‌.త‌మ పార్టీ అభ్య‌ర్థి గెల‌వ‌క‌పోతే త‌మ డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని కండీష‌న్లు కూడా పెట్టార‌ట‌.

ఇంట‌ర్న‌ల్‌గా టీడీపీ వ‌ర్గాల్లోనే విన‌ప‌డుతోన్న స‌మాచారం ప్ర‌కారం ఇక్క‌డ టీడీపీ మొత్తం రూ.125 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలుస్తోంది.సో ఇక్క‌డ వైఎస్ ఫ్యామిలీ క్యాండెంట్‌ను ఓడించామ‌న్న సంతృప్తి కోసం టీడీపీ ఈ రేంజ్‌లో ఖ‌ర్చు చేస్తే కానీ ప‌న‌వ్వ‌లేద‌న్న మాట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube