చంద్ర‌బాబును తిడితే మీకు ప‌ద‌వి గ్యారెంటీ..!

ఈ హెడ్డింగ్ కాస్త షాకింగ్‌గా ఉన్నా ప్ర‌స్తుతం టీడీపీలో న‌డుస్తోన్న ట్రెండ్ ఇదే.ఎవ‌రైనా త‌న‌కు శ‌త్రువులుగా ఉన్న వాళ్ల‌ను, త‌న‌ను తిడుతూ, త‌న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే వాళ్ల‌ను దూరంగా పెడ‌తారు.

 Tdp Seniors Joking On Chandrababu-TeluguStop.com

కానీ చంద్ర‌బాబు మాత్రం వాళ్ల‌కు ఇంచ‌క్కా ప‌ద‌వులు ఇస్తున్నారు.ఈ ప‌రిస్థితిపై టీడీపీ సీనియ‌ర్లు, ఆ పార్టీలో క‌ష్ట‌ప‌డుతోన్న వాళ్లు ప్ర‌స్తుతం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

చంద్ర‌బాబును ఎవ‌రైతే బాగా తిట్టారో వాళ్లకే ఇప్పుడు ప‌ద‌వులు ఇస్తూ… వారికి పెద్ద పీట వేస్తున్నారు.ఇది పార్టీ క్యాడర్ కు ఏమి సంకేతాలు పంపుతుందని నాయకులు ప్రశ్నిస్తున్నారు.

గ‌తంలో కాంగ్రెస్ ఉన్న టీజీ వెంక‌టేష్ రాష్ట్ర విభ‌జ‌న టైంలో చంద్ర‌బాబుపై పార్టీ ప‌రంగాను, వ్య‌క్తిగ‌తంగాను తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.ఆయ‌న‌కు బాబు ఏకంగా రాజ్య‌స‌భ ఇచ్చారు.

టీజీకి రాజ్య‌స‌భ సీటు ద‌క్క‌డం టీడీపీలోనే చాలా మందికి పెద్ద షాక్ ఇచ్చింది.ఇక తాజాగా గ‌తంలో అదే కాంగ్రెస్‌లో ఉన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ ప‌రిస్థితి కూడా అంతే.

ఆయ‌న కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న‌ప్పుడు బాబు గతంలో ప్రచురించిన ‘మనసులో మాట’ పుస్తకంలోని విష‌యాలు బ‌య‌ట‌కు తెచ్చారు.దీని వ‌ల్ల చంద్ర‌బాబు రాజ‌కీయంగాను, వ్య‌క్తిగ‌తంగాను చాలా ఇబ్బంది ప‌డ్డారు.

ఇప్పుడు గ‌ట్టి పోటీ ఉన్నా బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు.

ఇక కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు జేసీ సోద‌రులు చంద్ర‌బాబును తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేవారు.

ఇప్పుడు వాళ్ల ఫ్యామిలీకి బాబు ప‌ద‌వుల మీద ప‌ద‌వులు ఇస్తున్నారు.జేసీకి ఎంపీ, ఆయ‌న సోద‌రుడు ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఎమ్మెల్యే, ఇప్పుడు అల్లుడు దీప‌క్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు.

ఇక కాంగ్రెస్‌లో ఉండ‌గా చంద్ర‌బాబు ఆడేసుకున్న జూపూడికి ఎమ్మెల్సీ ఇవ్వ‌డంతో పాటు చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.

ఈ వ్య‌వ‌హారంపై టీడీపీలో సీనియ‌ర్లు, ఇత‌ర పార్టీ నేత‌లు చంద్ర‌బాబును ఎంత బాగా తిడితే వారికే ప‌ద‌వులు వ‌స్తాయ‌ని జోకుల మీద జోకులు పేల్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube