మహానాడు వేదికగా కేంద్రంతో యుద్ధానికి సిద్ధం ?

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ కు లక్షలాది కోట్లు ఇచ్చేసామని, వాటిని ఖర్చు చేయటం రాక కేంద్రంపై నెపాన్ని నెట్టేస్తున్నారంటూ సోము వీర్రాజుతో సహా పువురు బిజేపీ నేతలు తెలుగు దేశం పార్టీపై కారాలు నూరటం ఈ మధ్య సర్వ సాధారణం అయిపోవటం దేశం నేతలకు మింగుడు పడటం లేదనిపిస్తోంది.దీంతో మిత్ర పక్షంపై ఎదురుదాడికి దిగేందుకే దేశం పార్టీ సీనియర్లు సిద్దమైనట్లు కనిపిస్తోంది.

 Tdp Ready To  Prepare Fight With Bjp  ?-TeluguStop.com

కాంగ్రెస్‌ నుంచి వచ్చిన కన్నా లక్ష్మినారాయణ, పురందరేశ్వరితో సహా రాష్ట్రానికి వస్తున్న భాజపా నేత మాటలన్నీ కోట్లు దాటిపోవటంతో జనం వాటిపై ఆరాు తీసి.తమ చాపకు నీళ్లు వచ్చేలా చూడకముందే మేల్కోవాని దేశం నేతు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే ప్రత్యేక హోదా అంటూ జగన్‌ దీక్షు చేసినా పట్టనట్లున్న పాక పార్టీ నేతలు, ఇన్నాళ్లూ ఓపిక వహించి, స్నేహపూర్వక వాతావరణంలో సమస్య చక్కదిద్దుకుందామని అనుకున్నారు

చంద్రబాబు ఢల్లీి పర్యటనలోనూ నిధులు, హోదా లపై తగిన హామీు అందలేదన్నది పార్టీలోనే వినవస్తున్న కథనం.దీంతో రంగంలోనికి దిగిన కొందరు సీనియర్లే భాజపా పై విమర్సనాస్త్రాలు ఎక్కుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి నెల్లూరు మినీ మహానాడు వేదికపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసేలా ఉన్నాయి

2014లో జత కల్సి పోటీ చేసిన తమ స్నేహాన్ని తెగ దెంపు చేసుకుని, జగన్‌తో జతకట్టాల ని చూస్తున్న నేతలు , రాష్ట్రానికి పదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామన్న ప్రధాని ఇచిన హామీ అమలు కాకుండా అడ్డు పడుతున్నారని సోమిరెడ్డి విరుచుకు పడ్డారు.విభజన చట్టాన్ని అమలు పరచడంలో కేంద్రంవిఫమైందని జిల్లా స్ధాయిల్లో జరుగుతున్న మినీ మహానాడుల్లో హోదా కోసం ప్రత్యేక తీర్మానాలని చేయటం ద్వారా మరింత పదును పెడుతున్నట్లే ఉందని పరిశీలకుల భావన

కాగా .ఈనెల 28న తిరుపతి లో జరగనున్న మహానాడులో సైతం బాబు సమక్షంలోనే కేంద్రాన్ని కడిగి పారేయాని కొందరు భావిస్తుండగా, సుతిమెత్తగనే.బాణాలు సంధించేందుకు మరి కొందరు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మరి మినీలో కనిపించిన ఫీుంకారాలు , మహా వరకూ ఉంటాయా? అన్నదే ప్రశ్న.?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube