Tdp Leaders Insulting Old Lady For Pension

తెలుగుదేశం పార్టీకి ఆది నుంచీ వెన్ను దన్నుగా ఉన్నది మహిళలే.చంద్రబాబు కూడా మహిళా అభివృద్ధి విషయంలో రాజీపడరు.

 Tdp Leaders Insulting Old Lady For Pension-TeluguStop.com

రాష్ట్రంలో మహిళ కన్నీరు పెట్టకుండా చూస్తాం అని చెప్పిన చంద్రబాబు నిన్న చెప్పిన మాటలు అప్పుడే ఆవిరి అయ్యాయి.బాబు పాలనలో మహిళలు సిగ్గుతో కుమిలిపోతున్నారు.

సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామని ప్రతి నెలా 1నే ఠంచనుగా పింఛన్ ఇస్తున్నామని పదే పదే చెప్పుకొనే బాబు పాలనలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మాకు పింఛన్ మంజూరు చేయడంలేదని మొర పెట్టుకుంటున్నారు.తాజాగా వెలుగు చూసిన ఒక ఘటన ఇప్పుడు టిడీపి పరువుని తీసిపడేసింది.

పింఛను మంజూరు చేయమని కోరిన మహిళను ఆమె కుటుంబాన్నీ టీడీపీ నేతలు ఘోరంగా అవమానించారు.అసలు విషయంలోకి వెళ్తే

వెంటగిరి మండలం.

నెల్లూరు జిల్లా.కలపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు గిన్నేరి నరసమ్మ భర్త చనిపోయాడు.

ఆయన బతికి ఉన్నంత వరకు కూలి చేసుకుని జీవనం సాగించిన ఈ కుటుంబం.ఇప్పుడు జీవనాధారం కోల్పోయింది.

ఈ క్రమంలో తనకు వితంతు పింఛన్ మంజూరు చేయించాలని స్థానిక టీడీపీ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేసింది.ఇది ఇలా ఉంటే గతంలో ఆమె భర్త వైసీపీలో పనిచేయడంతో టీడీపీ నేతలు దీనిని సాకుగా చూపి.

నరసమ్మకు పింఛన్ మంజూరు చేయకుండా ఆపేశారు.అయినా నరసమ్మ పదేపదే వారికి తన బాధ వినిపించడంతో ఆఖరుకు ఘోరంగా అవమానించారు.

మీరు వేరే పార్టీకి చెందిన వాళ్లు కాబట్టి కుటుంబ సభ్యులంతా వచ్చి మా కాళ్లు పట్టుకుంటే పింఛన్ మంజూరు చేస్తాం అని టిడీపి నాయకులు ఘోరంగా అవమానించినట్టు నరసమ్మ చెప్తూ కన్నీటి పర్యంతమైంది

వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభానికి విచ్చేసిన జెడ్పీ చైర్మన్ కు కలపాడు దళితవాడ వాసులు పలు సమస్యలను చెప్పుకొచ్చారు.వర్షాకాలంలో రోడ్లపై నడవాలంటే తీవ్ర ఇబ్బందికరంగా ఉందని వాపోయారు.

అంతేగాక తమ గ్రామంలో పింఛన్ అర్హత కలిగిన 15 మంది ఉన్నామని ఒక్కరికి కూడా టీడీపీ నాయకులు పింఛన్ మంజూరు చేయడం లేదని వాపోయారు.సమస్యలని విన్న జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి సమస్యలని త్వరలోనే పరిష్కరించేలా చేస్తాను అని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube