బాబు నిర్ణయంతో తలపట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు

జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటనతో చంద్రబాబు నాయుడికి టెన్షన్ మొదలయ్యింది.తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కి వచ్చిన ఆదరనే…ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వస్తుంది అనే భయం చంద్రబాబు నాయుడికి బాగానే ఉంది.

 Tdp Leaders Dissapointed With  Chandrabau Decision-TeluguStop.com

ఆ భయం తాలూకు కోపాన్ని ఉద్రేకాన్ని చంద్రబాబు కార్యకర్తలు మీద ఎమ్మెల్యేల మీద చూపిస్తున్నారు.ఒక పక్క ఇంటింటికి టిడిపిని పొడిగించే కార్యక్రమంలో పడ్డారు చంద్రబాబు ఎందుకంటే జగన్ పాదయాత్రలు చేస్తుంటే.

చంద్రబాబు తెలుగుదేశం ఎటువంటి కార్యక్రమాలు ఆసమయంలో లేకపోవడంతో చంద్రబాబు ఇంటింటి టిడిపిని మరో 90 రోజులు పొడిగించే పనిలో పడ్డారు.అసలు ఈ నెలాకరున తెలుగుదేశం కార్యక్రమం పూర్తి అవ్వాల్సి ఉండగా.

మళ్ళీ పోడిగించడంపై తమ్ముళ్ళు అందోళనలకు గురవుతున్నారు

ఒకపక్క ఇంటింటికీ పాదయాత్రలు చేస్తూ అలిసిపోయిన కార్యకర్తలు .చంద్రబాబు నిర్ణయంతో తలలు పట్టుకుంటున్నారు.ఒకరోజు రెండురోజులు అయితే జనం సపోర్ట్ చేస్తారు అలాంటిది.మళ్ళీ పొడిగిస్తే.ఈసారి జనాలు రారు.ఇప్పటికే.

కార్యకర్తల దగ్గర డబ్బులు నిండుకున్నాయి.ఎమి చేయాలో అర్ధంకాని పరిస్థితిలో ఉన్నారు.

ఇదే ఇప్పుడు తమ్ముళ్ల బాధ.ఇప్పటికే ఇంటింటికి.లో భారీగా ఖర్చు అయిపోయామని మరో 90 రోజులంటే అమ్మో… అంటున్నారు ఆఫ్ ది రికార్డ్ లో తమ్ముళ్ళు.అయితే .ప్రస్తుతం టికెట్స్ ఆశిస్తున్న.వారిపై సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ ఖర్చు భారాన్ని మోపుతున్నారు అని తెలుస్తోంది.

ఒకటి రెండు రోజులు కాకుండా నెలల తరబడి జనంలో తిరుగుతూ ఖర్చులు భరించడం అంటే వారికి ఇబ్బందిగా మారింది

ఎలాగో అలాగా రెండు వీధులు తిరిగి ఒకటి రెండు ఫోటోలు దిగి పంపుదామా అంటే అలాంటివారికి చంద్రబాబు నాయుడు గ్రేడ్స్ తక్కువ ఇచ్చి ఝలక్ ఇస్తున్నారు.దాంతో తమ్ముళ్ళు అవ్వక్కవుతున్నారు.

పార్టీ నిఘా వర్గాలు , అధికార పార్టీ అనుకూల పత్రికలు వారి తరపున వేగులుగా పనిచేస్తున్న పాత్రికేయుల నుంచి నేతలకు తలనొప్పులు మొదలు అవుతున్నాయి.ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి.

ముందుకు వెళ్తే నుయ్యి.వెనక్కి వెళ్దామంటే గొయ్యిలా తయారయ్యింది.

తెలుగు తమ్ముళ్ళ పరిస్థితి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube