Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

టీడీపీకి ఆ ప‌ద‌వి క‌లిసి రావ‌ట్లేదా..!-TDP Ki Ah Padhavi Kalisi Ravadam Leda..?

రాజ‌కీయాల్లో కొన్ని సెంటిమెంట్లు భ‌లే చిత్ర విచిత్రంగా ఉంటాయి. కొన్ని ప‌ద‌వులు కొన్ని పార్టీల‌కు క‌లిసి రావు. గ‌తంలో టీడీపీలో నెంబ‌ర్ 2గా ఉన్న వారికి ఏవో ప్ర‌మాదాలు జ‌రుగుతూ ఉండేవి. ఇప్పుడు ఆ పార్టీకి శాస‌న‌మండ‌లి పెద్ద‌గా అచ్చిరావ‌డం లేద‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇటీవ‌ల శాస‌న‌మండ‌లికి ఎవ‌రిని ఎంపిక చేసినా వారు పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు.

కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో లోకేశ్ కూడా కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. లోకేశ్‌-చంద్ర‌బాబు క‌ల‌సి పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన వారు త‌ర‌చూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఈసారి లోకేశ్ ఎంటర్ కావడంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు జరిగాయని చెబుతున్నారు. లోకేష్ అనుభవలేమి ఇందులో స్పష్టంగా కన్పిస్తుందని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు.

Continue Reading

Trending…

To Top