బాబుకి సంబంధం ఏమిటో ? దేశం మండిపాటు

హైకోర్టు విభజన విష‌యంలో త‌న అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా కేసీఆర్‌ మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ మండిపడింది.గురువారం విజయవాడలోని కేశినేని భవన్‌లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ… కోర్టు ప‌రిధిలో జ‌రిగిన నియామ‌కాల‌కు, చంద్రబాబు సంబంధం ఏమిటో కేసీఆర్‌ సమాధానం చెప్పలేకున్నార‌ని, సొంత ్ర‌ప‌యోజ‌నాల‌కోసం న్యాయ వ్య‌వ‌స్థ‌కు సైతం ప్రాంతీయతత్వం అంటగట్టడం కేసీఆర్‌కే చెల్లింద‌ని విమ‌ర్శించారు.

 Tdp Fire On Kcr-TeluguStop.com

ప‌దే ళ్ల‌పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిలో ఉంటే త‌న‌కు నచ్చిన‌ట్టు ఆట‌లాడాల‌ని చూస్తూ చేసిన కుయుక్తులకు అడ్డుక‌ట్ట వేస్తూ లోటు బడ్జెట్‌ ఉన్నప్పటికీ ఆం్ర‌ద‌ప్ర‌దేశ్‌కు సొంత రాజ‌ధాని నిర్మించుకుంటున్న తీరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసూయాప‌రుడిని చేసింద‌ని విమ‌ర్శించారు.ప్ర‌తి చిన్న విష‌యానికి చంద్ర‌బాబే కార‌ణ‌మంటూ ఆరోప‌ణ‌లు చేయ‌టం, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ని క‌ల‌సి ఫిర్యాదులు చేయ‌టం అల‌వాటుగా మారింద‌ని అన్నారు.

హైకోర్టు విభ‌జ‌న వ్య‌వ‌హారం యావ‌త్తు కోర్టు ప‌రిధిలోనే జ‌రుగుతాయ‌ని తెలిసినా, విభ‌జ‌న చ‌ట్టాల‌ను తిరిగి స‌వ‌రించాలంటూ తెరాస ఎంపీలు కొత్త ప‌ల్ల‌వి ఎత్తుకోవ‌టం, స‌మంజ‌సం కాద‌న్నారు.కేంద్రంపై విమ‌ర్శ‌ల‌కు దిగ‌టం, ఢిల్లీలో దీక్ష‌లంటూ ప్ర‌క‌ట‌న‌లుచేయ‌టం ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డంలో భాగ‌మ‌ని, వాస్త‌వాలు చెప్పిన కేం్ర‌ద మంత్రుల‌పై కేసులు పెట్ట‌డం, న్యాయ‌మూర్తుల దిష్టిబొమ్మ‌లు త‌గ‌లు పెట్ట‌డం ఇలా న్యాయవ్యవస్థనే తప్పుబట్టే చ‌ర్య‌లు చేప‌డుతున్నారని తెదేపా ఎంపీలు మండిపడ్డారు.

మ‌రోవైపు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సైతం క‌ర్నూలు మీడియా స‌మావేశంలో కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలిని త‌ప్పుప‌ట్టారు.కోర్టుల‌కు సంబంధించిన న్యాయాధికారుల నియామ‌కాల‌లో ప్రభుత్వ జోక్యం ఉండద‌ని తెలిసినా, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ని కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేయ‌టం కేసీఆర్‌కి త‌గ‌నిద‌న్నారు.

అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి కేంద్రం త‌గిన‌న్ని నిధులు ఇచ్చేలా కేసీఆర్ ఎందుకు మాట్టాడ‌ర‌ని నిల‌దీసారు.ఈ విష‌య‌మై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడాల్సిన బాధ్య‌త కేంద్రంపై ఉంద‌ని అన్నారు.

TDP Leaders Fires, CM KCR, Lawyers Agitation, bifurcation of Hyderabad High Court

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube