Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

బీజేపీ, టీడీపీ క్రెడిట్ గేమ్ స్టార్ట్‌-TDP-BJP Credit Game Starts

ఏపీకి కేంద్రం నిధులు ఇచ్చినా.. వ‌రాలు ప్ర‌క‌టించినా టీడీపీ-బీజేపీ మ‌ధ్య క్రెడిట్ వార్ మొద‌ల‌వుతోంది. త‌న కృషి, ప‌ట్టుద‌ల‌, ఒత్తిడి వ‌ల్లే కేంద్రం రాష్ట్రానికి వ‌రాలు కురిపిస్తోంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు బ‌ల్ల గుద్ది మ‌రీ చెబుతుంటే… అబ్బే అంత సీన్ ఏమీ లేద‌ని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌ని, ఇచ్చిన హామీ మేర‌కే ఇదంతా చేస్తోంద‌ని రాష్ట్ర బీజేపీ నాయ‌కులు మ‌రీ గట్టిగా చెబుతున్నారు. ఇప్పుడు ప్ర‌త్యేక ప్యాకేజీకి, పోల‌వ‌రానికి నిధులు వంటి విష‌యాల్లో మ‌ళ్లీ మిత్రుల మ‌ధ్య `క్రెడిట్‌` వార్ మొద‌లైంది.

వరాలు ఇచ్చింది కేంద్రమే అయినా.. అదంతా తాను చేసిన కృషి వల్లనేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకోవటం షురూ చేశారు. ప్యాకేజీలో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధుల్ని సమకూర్చటం తన గొప్పతనంగా బాబు చెప్పుకోవటం మొదలైంది. ఈ ప్రచారాన్నిఏపీ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మిత్రపక్షంగా సాధించిన విజయాల్ని ఇరువురి ఖాతాల్లో వేసుకోవాల్సిన అవసరం ఉన్నా.. చంద్రబాబు తనదైన బుల్ డోజింగ్ తీరుతో.. తమకు దక్కాల్సిన మైలేజీని తమకు దక్కకుండా చేస్తున్నాడని.. ఇది తమ పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందని ఏపీ కమలనాథులు వాపోతున్నారు.

ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టుకు నిదులు సాధించే విషయంలో కమలనాథుల మీద ఒత్తిడి తెచ్చింది తానేనని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ బీజేపీ నేతల వాదన మరోలా ఉంది. చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా..కేంద్రం కానీ పాజిటివ్ గా రియాక్ట్ కాకుంటే పనులు పూర్తి అయ్యేవా?అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. చట్టబద్దత కల్పించిన ప్యాకేజీ..అందులోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన క్రెడిట్ మొత్తం తమదేనని.. ఆ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తున్నారు. చంద్ర‌బాబు తీరుపై కొంత కాలంనుంచి సోము వీర్రాజు గుర్రుగా ఉన్నారు. కొంత కాలంనుంచి సైలెంట్‌గా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చారు.

తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్ర‌చారాన్నిసమర్థంగా అడ్డుకోవాలన్నది ఏపీ బీజేపీ నేత లక్ష్యం. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు.. ఎమ్మెల్సీ సోము వీర్రాజు అప్పుడే తన వాదనను వినిపిస్తున్నారు. ఏపీ తమ పార్టీకి ప్రత్యేకమని..ఇప్పటివరకూ తామేం చేశామన్న విషయాన్నిప్రచారం చేసుకోనున్న విషయాన్ని ఆయన సూచనప్రాయంగా సంకేతాలు ఇచ్చేశారు. ప్రత్యేక ప్యాకేజీ..పోలవరం క్రెడిట్ ను తమ ఖాతాల్లోకి వేసుకోవాలని తహతహలాడుతున్న ఏపీ టీడీపీ నేతలకు..వీర్రాజు అండ్ కో మింగుడు ప‌డ‌ని అంశంలా మారారు!

Continue Reading

More in Featured

 • Missing Indonesian was found dead inside a big snake

  By

  అతని పేరు అక్బర్ సాలుబిరో. ఇండోనేషియాలోని ఓ పల్లెటూరిలో నివసించేవాడు. అతను తవుడు నూనే వ్యాపరం చేసేవాడట. ఓరోజు అదే పని...

 • Get 60GB – 120GB free data with Jio Prime

  By

  జియో వెల్కమ్ ఆఫర్ కి రేపే చివరి తేది. రేపు అర్థరాత్రి, 11:59 నిమిషాలు దాటగానే, మీరు జియో సర్వీసులకి డబ్బులు...

 • NEWS

  Agri Gold Issue Leaves Pawan Kalyan Behind

  By

  ఆకులు కాలాక చేతులు ప‌ట్టుకుని ఏం లాభం..ఈ విష‌యం ఇప్పుడు జ‌నసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు స‌రిగ్గా స‌రిపోతుంది. కొన్ని రోజులుగా అగ్రిగోల్డ్...

 • HEALTH TIPS

  Early morning skin care tips

  By

  ఆరోగ్యానికి సంబంధించిన మంచిపనులన్ని పొద్దున్నే మొదలుపెట్టాలని చెబుతారు డాక్టర్స్. ఎందుకంటే మన శరీరం మీద ధ్యాస పెట్టడానికి అదే మంచి సమయం....

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..