చేతులు క‌లుపుతోన్న టీడీపీ+కాంగ్రెస్‌

తెలుగు రాజ‌కీయాల్లో మూడున్న‌ర ద‌శాబ్దాల ఘ‌న‌మైన చ‌రిత్ర టీడీపీది.జాతీయ పార్టీ కాంగ్రెస్ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా ఆవిర్భ‌వించిన టీడీపీ అలాంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం ఏంటా ? అని షాక్ అవ్వ‌క‌త‌ప్ప‌దు.అయితే తెలంగాణ‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఉండొచ్చ‌న్న‌ట్టుగా ఉన్నాయి.

 Tdp Alliance With Congress In Telangana-TeluguStop.com

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీతో పొత్తు సంగ‌తి డౌటే అని భాజ‌పా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

ఆంధ్రాలో టీడీపీతో క‌లిసి ప‌నిచేస్తామ‌ని చెపుతూనే తెలంగాణ దాదాపుగా పొత్తు ఉండ‌ద‌న్న సంకేతాలే ఆయ‌న ఇచ్చేశారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి మ‌రోసారి పీఎం పీఠం ఎక్కాల‌ని భావిస్తోన్న మోడీ సౌత్‌లో టీడీపీ, టీఆర్ఎస్‌, అన్నాడీఎంకే లాంటి బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీల‌తో పొత్తు పెట్టుకోవాల‌ని భావిస్తున్నారు.

బీజేపీ కేసీఆర్‌తో జ‌ట్టుక‌డితే టీటీడీపీ అప్పుడు ప్ర‌త్యామ్నాయం వెతుక్కోవాల్సి ఉంటుంది.ఇక కేసీఆర్‌ను ఎలాగైనా గ‌ద్దె దింపాల‌ని చూస్తోన్న రేవంత్‌రెడ్డి తెలంగాణ కేసీఆర్ వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఒక్క‌టి చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

ఈ క్ర‌మంలోనే టీడీపీ+కాంగ్రెస్‌+వామ‌ప‌క్ష పార్టీల‌తో ఆయ‌న మెగా ఫ్రంట్‌ను ఏర్పాటుకు కృషి చేస్తున్నారు.

కాంగ్రెస్‌తో క‌లిసే అంశంపై తొంద‌ర‌ప‌డ‌వ‌ద్ద‌ని రేవంత్‌కు చంద్ర‌బాబు చెపుతున్నా రేవంత్ మాత్రం కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు ఎవ‌రితో అయినా క‌లిసేందుకు సిద్ధ‌మ‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.

తెలంగాణ‌లో టీఆర్ఎస్ త‌ర్వాత‌ రెండో పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉంది.ఆ విష‌యం కేసీఆర్ విమ‌ర్శ‌ల్లోనే ఎప్ప‌టిక‌ప్పుడు అర్థ‌మౌతోంది.తెలంగాణ‌లో ప్ర‌స్తుతం తెలుగుదేశం స్థానం ఎక్క‌డో ఉంది.టీడీపీకి అక్క‌డ పేరున్న నాయ‌కులు కూడా లేరు.

దీంతో రేవంత్ కేసీఆర్‌ను గ‌ద్దె దింపేందుకు కాంగ్రెస్‌తో అయినా చేతులు క‌లిపేందుకు రెడీగా ఉన్నారు.మ‌రి ఈ కొత్త ఫ్రంట్ ఏర్పాటు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube