ఆ పదవులు చంద్రబాబు కి కలిసి రావా ..!?

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఉప ప‌ద‌వులు పెద్ద‌గా క‌లిసి రావా ? అవి ఆయ‌న‌కు బ్యాడ్ సెంటిమెంటా ? అంటే అవున‌నే చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి.బాబుకు డిప్యూటీ – ఉప ప‌ద‌వులు పెద్ద‌గా క‌లిసి రాలేద‌ని ఆయ‌న హిస్ట‌రీ చూస్తే అర్థ‌మ‌వుతోంది.2004 నుంచి 2014 మధ్య టీడీఎల్పీ ఉపనేతలుగా పని చేసిన వాళ్ళు చాలా మంది బాబుని అదను చూసి దెబ్బ కొట్టారు.2004లో చంద్ర‌బాబు ఫ‌స్ట్ టైం ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు.

 Tdlp Leaders Bad Sentiment For Chandrababu-TeluguStop.com

ఆ టైంలో చంద్ర‌బాబు టీడీఎల్పీ ఉపనేతలుగా దేవేందర్ గౌడ్,కళా వెంకటరావు,నాగం జనార్దన్ రెడ్డి ని ఎంపిక చేసుకున్నారు.త‌ర్వాత కాలంలో వీరు ముగ్గురు చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చారు.దేవేంద‌ర్‌గౌడ్ , క‌ళా వెంక‌ట‌రావు కీల‌క టైంలో చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు.

2009లో చంద్ర‌బాబు వ‌రుస‌గా రెండోసారి ప్ర‌తిపక్ష‌నేత‌గా ఎన్నిక‌య్యారు.అప్పుడు వ‌రుస‌గా రెండోసారి టీడీఎల్పీ నేత‌గా ఛాన్స్ ద‌క్కించుకున్న సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవేంద‌ర్‌గౌడ్ టీడీపీని వీడారు.ఆయ‌న తెలంగాణ ఉద్య‌మ నేత‌గా ఆవిర్భ‌వించేందుకు విఫ‌ల‌య‌త్నం చేసి చివ‌ర‌కు బీజేపీలో చేరిపోయారు.

ఇక 2014లో తెలంగాణ ఏర్ప‌డ్డాక పార్టీ నుంచి టీ టీడీపీ ఫోరమ్, టీడీఎల్పీ నేతలుగా పనిచేసిన ఎర్రబెల్లి, తలసాని శ్రీనివాసయాదవ్ వంటి వాళ్ళు కూడా టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు.ఇక ఏపీలో ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక ముందుగా హామీ ఇచ్చిన‌ట్టుగానే నిమ్మ‌కాయ‌ల చినరాజ‌ప్ప‌, కేఈ.కృష్ణ‌మూర్తికి డిప్యూటీ సీఎం ప‌ద‌వులు ఇచ్చారు.చిన‌రాజ‌ప్ప ప్ర‌భుత్వంలో అంత కీ రోల్ పోషించ‌లేక‌పోతున్నారు.

కీల‌క‌మైన హోం శాఖ‌కు మంత్రిగా ఉన్నా ఆయ‌న ఆ శాఖ‌మీద ఇంకా గ్రిప్ సాధించ‌లేక‌పోయారు.

ఇక మరో డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణ‌మూర్తికి చంద్ర‌బాబుకు ఉప్పు -నిప్పుగా పరిస్థితి ఉంది.పద‌వుల కోసం ఆయ‌న బీసీ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు.

మ‌రో టాక్ ఏంటంటే త‌న‌తో క‌లిసి చ‌దువుకున్న కేఈ కుమారుడికి జ‌గ‌న్ గాలం వేశాడ‌ని తెలుస్తోంది.దీంతో చంద్ర‌బాబుపై అసంతృప్తితో ఉన్న కేఈ ఏం చేస్తాడ‌న్న‌దే ఇప్పుడు స‌స్పెన్స్‌గా మారింది.

ఏదేమైనా చంద్ర‌బాబుకు డిప్యూటీ – ఉప ప‌ద‌వుల బ్యాడ్ సెంటిమెంట్ పెద్ద త‌ల‌నొప్పిగానే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube