బ్రిటీష్ పార్లమెంటులో తనికెళ్ళ పుస్తకం

సినీనటుడు, దర్శకుడు, రచయిత అయిన తనికెళ్ల భరణి కి అరుదయిన గౌరవం లభించింది .తనికెళ్ళ రాసిన ఓ పుస్తకం బ్రిటీష్ పార్లమెంటులోవిడుదలకు నోచుకుంది.‘ప్యాసా’ టైటిల్‌తో తనికెళ్ళ భరణి రచించిన ఈ పుస్తకం అక్కడ రిలీజయ్యేలా చూడడంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలిబుద్ధప్రసాద్ కీలకపాత్ర పోషించారు బ్రిటీష్ ఎంపీ డాన్‌బైల్స్, బ్రిటన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు ఇందుకు సహకరించారని తనికెళ్ళ తెలిపారు.తెలుగు అమ్మాయి నందిని రెడ్డి నివివాహం చేసుకున్న డాన్‌బైల్స్ ఈ పుస్తకం బ్రిటన్ పార్లిమెంట్ లో విడుదల కావటంలో ఎంతో సహకరించారని తనికెళ్ళ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

 Tanikella Bharani’s Book Was Released In British Parliament-TeluguStop.com

ఉమర్ ఖయ్యాం- ‘ రుబాయత్ ’ పుస్తకం స్ఫూర్తిగా తనికెళ్ల భరణి ప్యాసాను రచించారు.ఈ గ్రంథం ఆస్ర్టేలియాతోబాటు వివిధ దేశాల్లోకూడావిడుదలైంది.తనకు ఇది అరుదైన గౌరవంగా తనికెళ్ల భరణి భావిస్తున్నారు.ఒక తెలుగుపుస్తకం బ్రిటీష్ పార్లమెంట్‌లో ఆవిష్కరణ కావడం ఇదేమొట్టమొదటిసారి.

సినిమాలలో ఏ పాత్రనైనా అవలీలగా పోషించే భరణి రచయితగా కూడా ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకోవడం టాలీవుడ్ సినీపరిశ్రమకు గౌరవంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube