జయలలిత కి వెన్నులో వణుకు

దేశంలో నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు ముగిశాయి.ఎన్నికలు ముగిసిన వెంటనే.

 Jayalalitha Is Not Happy-TeluguStop.com

ఎగ్జిట్ పోల్స్ తమ సర్వే ఫలితాలను వెలువరిచాయి.ఎన్నికల ముందు వరకు అమ్మకే అనుకూలం అనుకూలం అనుకున్న ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల తరువాత రివర్స్ అయ్యాయి.

తమిళనాడులో డిఎంకె పార్టీవైపు ప్రజలు మొగ్గు చూపారని తెలుస్తున్నది.

ఈ ఎన్నికలలో డిఎంకె, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి.

ఇక చాలా కాలం తరువాత వైగో ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.అటు, విజయ్ కాంత్ పార్టీ డిఎండికె పార్టీ కూడా అన్ని స్థానాలకు పోటీ చేసింది.

తమిళనాడు రాజకీయాలలో పెను మార్పు వస్తుందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఈసారి తమకే అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.

కాని, ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం డిఎండికె కు డిపాజిట్లు కూడా దక్కవని తెలుస్తున్నది.

మరోవైపు తమిళనాడు ఎన్నికల గురించి వివిధ సర్వేలు చేసిన సర్వే ప్రకారం ఇండియా టుడే, న్యూస్ ఎక్స్, న్యూస్ నేషన్ లు డిఎంకె పార్టీకి అనుకూలంగా ఉన్నాయి.టైమ్స్ నౌ మాత్రం అన్నా డిఎంకె కు అనుకూలంగా ఉన్నది.

అమ్మ పధకాలు ప్రజలలోకి వెళ్ళినప్పటికీ .తమిళ ప్రజలు తమ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.డిఎంకె వైపు మొగ్గుచూపారని కొందరు అంటున్నారు.ఇక, పశ్చిమ బెంగాల్ విషయం వచ్చే సరికి అన్ని సర్వేలు కూడా మమతాకే అనుకూలంగా ఉన్నాయి.మమతకు 200 నుంచి 250 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి.ఇక లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపిలకు పశ్చిమ బెంగాల్ లో భంగపాటు తప్పదు కేరళ విషయం తీసుకుంటే.

కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పగ్గాలు తిరిగి లెఫ్ట్ చేతికి అందబోతున్నాయి.

ఇక అస్సాం దగ్గరికి వస్తే.

అక్కడ చాలా కాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కోటకు బీటలుపడనున్నాయి.అస్సాం కోటలో కమలం వికసించబోతున్నది.

ఈ నాలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల అధికారం కోల్పోతున్నట్టు తెలుస్తున్నది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube