తమిళ హీరోలకి ఉన్న ధైర్యం తెలుగు హీరోలకి లేదా ?

గతవారం రోజులుగా ఏ మీడియా ఛానెల్ చూసిన “జల్లికట్టు” చర్చ నడుస్తూనే ఉంది.సుప్రీం కోర్టు దీని మీద బ్యాన్ విధించడంపై ఇటు నిరసనలు వ్యక్రం అవుతూ ఉండగా, పెటాకి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న త్రిషపై జల్లికట్టు మద్దతుదారులు చేసిన “రౌండ్ అప్” దాడి వలన, పెటాపై కూడా అందరి ద్రష్టి మళ్ళింది.

 Tamil Industry Unites For Jallikattu, Telugu Industry Still Silent On “spe-TeluguStop.com

తమిళ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు అని తేడా లేకుండా అందరు జల్లికట్టుకి సపోర్ట్ గా స్పీచులు ఇస్తున్నారు.అలాగే పెటాని తరిమికొట్టాలని వాదిస్తున్నారు.

జల్లికట్టుని అడ్డుకోవడం అంటే, తమిళ సంస్కృతీని అంతం చేయడమే అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.

రజినీకాంత్, విజయ్ లాంటి టాప్ హీరోలనుంచి నయనతార, సమంత లాంటి పెద్ద హీరోయిన్లు, మురుగదాస్ లాంటి అగ్రదర్శకులు, అందరు జల్లికట్టుకి మద్దతు తెలుపుతున్నారు.

తమిళనాడు అంతటా సుప్రీం కోర్టు తీరుపై నిరసన వ్యక్తం అవుతోంటే, వారిని సపోర్ట్ చేస్తూ సినిమా వాళ్ళంతా నేషనల్ మీడియాలో తమ గొంతు వినిపిస్తున్నారు.చూడండి వీరికున్న ఐక్యత, ధైర్యం.

ఇక తెలుగు సినిమా వాళ్ళు ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ విషయంలో అన్యాయం జరిగింది అంటూ ప్రజలు మొత్తుకుంటే, పవన్ తప్ప ఎవరు నోరు మెదపలేదు.

తమిళ హీరోలాగా, తమ ఆక్రోశాన్ని, నిరసనని దేశం మొత్తం వినిపించేలా మాట్లాడటం పక్కనపెడితే, కనీసం తెలుగు రాష్ట్రాల వరకైనా వారి వాదన వినబడలేదు.అసలు ఎవరైనా సరిగా మాట్లాడితే కదా.ఇలా ఎందుకు ? తమిళ ఇండస్ట్రీకి ఉన్న ధైర్యం, ఐక్యత తెలుగు ఇండస్ట్రీలో లేదంటారా ?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube