హీరోయిన్ అంజలికి లవ్ లెటర్ రాసిన కుర్ర హీరో

ఇప్పుడైతే తమ ప్రేమను వ్యక్తం చేయాలంటే అయితే ఒకరోజు డేటింగ్ అంటూ తీసుకెళ్ళి, ఖరీదైన హోటల్లొ భోజనం చేస్తూ, భోజనం ఇలా పూర్తవగానే అలా చిన్న సర్ ప్రైజ్ లా రింగ్ బయటకి తీసి తమ ఫిలింగ్స్ ని చెబుతున్నారు.లేదంటే సింపుల్ గా మొబైల్ ఫోన్ అందుకోని ఏదో ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫాం నుంచి ఓ మెసెజ్ పెడుతున్నారు.

 Tamil Actor Writes Love Letter To Actress Anjali-TeluguStop.com

కాని సోషల్ మీడియా ఏజ్ కి కొన్ని సంవత్సరాల ముందు కూడా లవ్ లెటర్స్ దే హవా.ప్రేమికుడు కాని, ప్రేయసి కాని తమ ప్రాణాల్ని అందులో నింపేసేవారు.ఇప్పుడు లవ్ లెటర్స్ రాయడం తగ్గించేసారు.కాని ఈ జమానాలో కూడా హీరోయిన్ అంజలికి లవ్ లెటర్ రాసి జనాల దృష్టిని ఆకర్షించాడు ఒక హీరో.

Tamil Actor writes love letter to actress anjali -  Tamil Actor Writes Love Lett

అ హీరో ఎవరో కాదు, తమిళ నటుడు జై.అదేనండి, అంజలి క్లోజ్ ఫ్రెండ్.ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని మీడియా ఎప్పటినుంచో వార్తలు రాస్తోంది.ఆ వార్తలు పచ్చినిజాలని ఈ జంట మరోసారి నిరూపించింది.

నిన్న అంజలి పుట్టినరోజు.దాంతో జై తన పుట్టినరోజు గ్రీటింగ్స్ ని, అంజలిపై తనకి ఉన్న ప్రేమని, మొత్తం ఓ లెటర్ రూపంలో రాసాడు.

Tamil Actor writes love letter to actress anjali -  Tamil Actor Writes Love Lett

“ఈ ప్రత్యేకమైనది రోజు నాకు నువు ఎంత ప్రత్యేకమో, అంతే ప్రత్యేకమైనది.ఈరోజు నేను నీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటింటే, నువ్వు నీలా ఉంటూ నా జీవితంలోని ప్రతిరోజుని స్పెషల్ గా మారుస్తున్నావు.నేను, ఆ దేవుడు ఎప్పటికి నీతోనే ఉంటాము.హ్యాపి బర్త్ డే అంజు (అంజలి) .ప్రేమతో జై” అంటూ అదిరిపోయే లవ్ లెటర్ రాసి డైరెక్టుగా ట్విట్టర్ లోనే పెట్టేసాడు ఈ హీరో.

దీనికి సమాధానంగా అంజలి “నాకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు జై.నువు నాతో ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.నాకు ముఖ్యమైన ఈరోజున ఇలాంటి సందేశం పంపినందుకు చాలా థ్యాంక్స్” అంటూ మురిసిపోతూ రిప్లై ఇచ్చుంది అంజలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube