తమన్నా కోసం 2 కోట్లు ఖర్చు పెట్టారు

పెద్ద హీరోయిన్లతో షూటింగ్ అంటే మాటలా.సినిమాలో హీరోయిన్ గా చేస్తే మామూలుగానే ఉంటుంది.

 Tamanna’s Item Number Costed Over 2 Crore-TeluguStop.com

ఓ 2,3 కోట్లు ఇచ్చేస్తే 30 రోజుల డేట్స్ ఇచ్చేస్తారు.కాని వారితో స్పెషల్ సాంగ్స్ ప్లాన్ చేస్తేనే తడిసి మోపెడు అవుతుంది ఖర్చు.

రెండు మూడు రోజుల షూట్ కోసం కోటికి తగ్గకుండా అడుగుతారు.సెట్స్ వేయాలి, వాళ్ళకోసం మంచి మంచి కాస్త్యుమ్స్ తీసుకురావాలి.

స్పెషల్ సాంగ్ కాబట్టి, అందాలు ఎక్కువగా ఆరబోయాలి కాబట్టి డిమాండ్లు కూడా ఎక్కువే ఉంటాయి.

ఇక ఇక్కడ మనం మాట్లడుకోబోయేది స్పీడున్నోడు చిత్రంలో తమన్నా చిందులేసిన “బ్యాచిలర్ బాబు” సాంగ్ గురించి.

ఈ ఐటెం సాంగ్ కోసం రెండు కోట్లకు పైగానే ఖర్చుపెట్టారంట.వామ్మో అని బిత్తరపోతున్నారా.అందులో తమన్నాకే 1.5 కోట్లు ఇచ్చారట.సాంగ్ షూట్ కోసం మరో 50 లక్షలకు పైగా ఖర్చుపెట్టారు.అంత ఖర్చుపెట్టినందుకు తమన్నా ఓపెనింగ్స్ లో ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి.

బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.స్పీడున్నోడు ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube