బికినీ అందాల మీద తమన్నా ఘాటు కామెంట్

80 దశకంలో మొదలు, హీరోయిన్ కేవలం కథని నడిపించడమే కాదు, కొన్ని అందాలు ఆరబోసి ప్రేక్షకుల కనులు తెరమీది నుంచి వెళ్ళకుండా కూడా చేయాలి అన్నట్లుగా హీరోయిన్ల పాత్రలు రాయడం, వారి బట్టలు డిజైన్ చేయడం మొదలుపెట్టారు సినిమావారు.ఇప్పటి హీరోయిన్ల స్కిన్ షో మీదే అంతా విమర్శలు చేస్తారు కాని, శ్రీదేవి, విజయశాంతి, జయప్రద, రాధ లాంటి అలనాటి అగ్రతారలు కూడా కమర్షియల్ హంగుల సినిమాలు మొదలయ్యాక స్కిన్ షో చేసినవారే.

 Tamannah Responds On Wearing A Bikini-TeluguStop.com

తేడా ఏంటంటే, పాటల్లో నాభి అందాలను దాటుకోని, చిట్టిపొట్టి బికినీల దాకా వచ్చారు నేటి హీరోయన్లు.

దక్షిణాదిలో హీరోయిన్ బికినిలో కనబడటం చాలా అరుదు.

అనుష్క, నయనతార, సమంత లాంటి అగ్రకథానాయికలో కనబడ్డారు కాని, వారు ఆయా సినిమాల్లో చేసిన పాత్రలనుసారం బికిని వేయాల్సవచ్చింది తప్ప, ఏదో గ్లామర్ కోసం ప్రత్యేకంగా బికిని వేయలేదు.కాని బాలివుడ్ లో అలా కాదు.

సీన్ డిమాండ్ చేసినా, చేయకున్నా, కథకి అవసరమున్నా లెకున్నా, హీరోయిన్ల చేత బికిని వేయిస్తారు.ఆ హీరోయిన్లు కూడా పోటిపడి మరి బికిని సీన్లు చేస్తారు.

మరి ఇటు సౌత్ లో, అటు హిందీలో టాప్ కథానాయికల్లో ఒకరిగా చెలామణి అవుతున్న తమన్నా సంగతి ఏంటి ? ఈ మిల్కి బ్యూటి ఇప్పటివరకు బికినీ వేయలేదు.అసలు వేస్తుందా వేయదా?

ఇదే ప్రశ్న తమన్నా దాకా వెళ్ళింది.దానికి సమాధానంగా, ఎప్పటికీ బికినీ వేయనని చెప్పింది మన అవంతిక.ఇప్పటి ప్రేక్షకులు కథని చూడటానికే తప్ప, హీరోయిన్ల అందాలు చూడటానికి థియేటర్లకి రావట్లేదని తమన్నా నమ్ముతోందట.

పైగా, సినిమా ఇండస్ట్రీలోకి అడగుపెడుతున్నప్పుడు తమన్నా తన తల్లిదండ్రులకి ప్రామిస్ చేసిందట, ఎప్పటికీ తనకి ఇష్టంలేని బట్టలు వేసుకోనని.ఆ ఇష్టం లేని బట్టల్లో బికినీ కూడా ఉండటం తమన్నా ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ లాంటిదే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube