తమన్నా మరి ఇంత చీపా..!

హీరోయిన్ గా ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించినా సరే తమన్నాకు ఐటం సాంగుల మీద మోజు తీరినట్టు లేదు.అసలు స్టార్ హీరోయిన్స్ ఎవరు ఐటం సాంగ్స్ చేసేందుకు ఇష్టపడరు కాని తమన్నా మాత్రం అందుకు విరుద్ధం.

 Tamanna Very Cheap For Item Song-TeluguStop.com

కుర్ర హీరోలైనా స్టార్ హీరో అయినా కోరిన పారితోషికం ఇస్తే ఐటం కు రెడీ అంటుంది.ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో రెండు ఐటం సాంగ్స్ చేసిన తమన్నా ఇప్పుడు కొత్త హీరో సినిమాకు ఓకే చెప్పిందట.కర్ణాటక మాజి సిఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా జాగ్వార్ సినిమా వస్తుంది.

70 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ కోసం ఐటం సాంగ్ ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు.అయితే ముందు ఐటం గాళ్ గా శృతి హాసన్ ను అనుకుంటే ఆమె కోటి పైగా పారితోషికం డిమాండ్ చేసిందట.అందుకే తమన్నాను తీసుకున్నారు.శృతి కోటి అడిగిందిగా తమన్నాకు ఓ 75 లక్షలకే మరి 50 లక్షలకో ఓకే చేసింది అనుకుంటే పొరపాటే చీప్ గా 25 లక్షలకు ఐటం సాంగ్ చేసిందట తమన్నా.మరి డిమాండ్ తగ్గిందని అలా చేసిందా లేక డబ్బు అవసరమై చేసిందా తెలియదు కాని ఆ సాంగ్ చేయడం తమన్నా డెశిషన్ ను తప్పుపడుతున్నారు సినిజనాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube