రాత్రిపూట ప్రభాస్‌ తలుపు తట్టిందట!!

టైటిల్‌ చూసి తప్పుగా అర్థం చేసుకోకండి.‘బాహుబలి’ సినిమా షూటింగ్‌ సమయంలో రాత్రి పూట తమన్నా ఆయన తలుపు పదే పదే తట్టిందట.

 Tamanna Meets Prabhas Midnight For Doubts-TeluguStop.com

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక మీడియా సమావేశంలో చెప్పుకొచ్చింది.‘బాహుబలి’ సినిమా కోసం తాను పడ్డ కష్టం గురించి తమన్నా వివరిస్తూ యుద్ద సన్నివేశాల సమయంలో ప్రభాస్‌ వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని, కొన్ని డౌంట్స్‌ ఏమైనా ఉంటే అర్థరాత్రి అని కూడా చూడకుండా ఆయన తలుపు తట్టి లేపి, తన సందేహాలను తీర్చుకునేదాన్ని అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

‘బాహుబలి’ సినిమా కోసం తాను ఏకంగా సంవత్సర కాలం పాటు ఏకబికీన షూటింగ్‌లో పాల్గొన్నాను అని, ఇంత కష్టం ఏ సినిమాకు కూడా పడలేదు అంటూ చెప్పుకొచ్చింది.ప్రభాస్‌తో యుద్ద సన్నివేశాలు మరియు రొమాన్స్‌ సన్నివేశాల్లో తన ఎత్తు చాలా పెద్ద సమస్యగా మారిందని, అలాంటి సమయంలో ముని వేళ్లపై నిలబడి చేయాల్సి వచ్చేది అంటూ చెప్పుకొచ్చింది.

తాను పడ్డ కష్టంకు సినిమా చూస్తుంటే అంతా పోతుందని, తాను పడ్డ కష్టం ఆన్‌ స్క్రీన్‌పై కనిపిస్తుందని ఈమె చెప్పుకొచ్చింది.మొత్తానికి తాను ‘బాహుబలి’లో పార్ట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube