ఈమె కోరికలు తీరాయట

జీవితంలో ముఖ్య కోరికలు తీరితే అంతకు మించిన ఆనందం మరేమి ఉండదు.తమన్నా ఇప్పుడు ఆ ఆనందాన్ని చవి చూస్తోంది.

 Tamanna Fulfilled Her Two Desires-TeluguStop.com

ఈ అమ్మడికి జీవితంలో రెండు ముఖ్య కోరికలు ఉండేవట.ఆ రెండు కోరికలు తీరి పోయాయి అని, ప్రస్తుతం తనకు ఎలాంటి పెద్ద కోరికలు లేవని అంటోంది.

తాను జీవితంలో పెద్ద హీరోయిన్‌గా మారాలని కోరుకున్నాను అని, అలాగే జ్యువలరీ డిజైనర్‌గా, వ్యాపారిగా మారాలని కోరుకున్నాను.మొదటి కోరిక చాలా కాలం క్రితమే తీరింది.

ఇక రెండవ కోరిక తాజాగా తీరిందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

అక్షయ తృతియ సందర్బంగా తమన్నా తాను డిజైన్‌ చేసిన జ్యువలరీతో షో రూంను ప్రారంభించింది.

తన తండ్రి వజ్రాల వ్యాపారి అవ్వడంతో తనకు జ్యువరీపై మక్కువ ఎక్కువ అయ్యిందని, దాంతో ఎప్పటికైనా జ్యువలరీ డిజైనర్‌గా మారాలని కోరుకున్నట్లుగా ఈమె చెప్పుకొచ్చింది.ఇప్పుడు తాను కోరుకున్న కోరిక తీరిందని చెప్పుకొచ్చింది.

ఈమె ప్రస్తుతం తెలుగులో నాగార్జున, కార్తిలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక ఈమె హీరోయిన్‌గా నటించిన ‘బాహుబలి’ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube