Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

హీరోయిన్ల బట్టలపై దర్శకుడి కామెంట్స్ ... తమన్నా, నయనతార సీరియస్-Tamamnah And Nayanatara Smashes Sexiest Comments From Director Suraj

తమిళ దర్శకుడు సూరజ్ హీరోయిన్ల స్కిన్ షో మీద చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి. కత్తి సాండయ్ (ఒక్కడొచ్చాడు) చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు, ప్రేక్షకులు సినిమా హాల్ కి హీరో ఫైట్స్, హీరోయిన్ అందాలు చూడటానికే వస్తారని, కాబట్టి తన సినిమా కాస్ట్యూమ్ డిజైనర్స్ మోకాళ్ళు కప్పేసే బట్టలు డిజైన్ చేస్తే ఒప్పుకొనని, హీరోయిన్ బట్టల సైజ్ ఎంత తగ్గిస్తే అంత మంచిదని సూచిస్తానని ఇటివలే సంచలనాత్మక వ్యాఖ్యలు చేసాడు.

ఈ కామెంట్స్ పై తమన్నా మండిపడింది. దర్శకుడు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేసింది.
“ఇది 2016, ఇలాంటి సందర్భంలో దంగల్ లాంటి మహిళా శక్తి సినిమా ప్రస్తావన తీసుకొస్తానని అనుకోలేదు. నా సినిమా దర్శకుడు సూరజ్ చేసిన వ్యాఖ్యలు నాకు బాధను, కోపాన్ని కలిగించాయి. తను నాకు మాత్రమే కాదు, ఇండస్ట్రీలో ఉన్న ఆడవారందరికి క్షమాపణ చెప్పాలి. మేము ప్రజల్ని రంజింపజేసే నటులం. వస్తువుల్లా చూడొద్దు. నేను దక్షిణాది సినిమాల్లో గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఎప్పుడూ నాకు సౌకర్యంగా అనిపించే బట్టలే తొడిగాను. ఈ దేశంలో అమ్మాయిల గురించి ఇలా పనికిరానట్టుగా మాట్లాడటం బాధాకరమైన విషయం. ప్రేక్షకులకి నా విన్నపం ఏమింటంటే, ఒక్కరి కామెంట్స్ వలన మొత్తం ఇండస్ట్రీ ఇలానే ఉంటుంది అని అనుకోకండి”

ఈ విషయంపై స్పందించిన నయనతార హీరోయిన్స్ స్ట్రిప్పర్స్ (బట్టలు విప్పేవారు) కాదు. తనకి సౌకర్యవంతంగా లేకపోతే ఏ అమ్మాయి చిన్న బట్టలు వేసుకోదని, గ్లామర్ ఒలికించేది కథలో భాగంగానే తప్ప, ఇంకేదో ఉద్దేశంతో కాదని, తన లాగా నీచంగా ప్రేక్షకులు ఆలోచించరని కడిగిపడేసింది.

Continue Reading
More Posts
To Top