నిద్రలేని రాత్రులు గడిపానంటున్న తాప్సి..!

తెలుగులో ఝుమ్మంది నాందం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తాప్సి పన్నుఅంత గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.అయితే బాలీవుడ్లో మాత్రం అమ్మడికి మంచి హిట్లు పడ్డాయి.

 Taapsee Pannu Speak-out Her Sleepless Nights-TeluguStop.com

హిట్లు వచ్చాయి కదా అని మిడిసి పడకుండా ఈ హిట్ కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది.ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ పింక్ సినిమాలో నటిస్తున్న తాప్సి మరో రెండు పెద్ద సినిమాల్లో నటిస్తుంది.

ప్రతి సినిమా హిట్ అవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తామని.ఎక్సాం రాసి రిజల్ట్ కోసం ఎలా ఎదురు చూస్తామో అలానే సినిమా రిలీజ్ టైంలో ఫలితం ఎలా వస్తుందో అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెబుతుంది తాప్సి.

సౌత్ లో కెరియర్ ముగిసినా బీ టౌన్ లో మాత్రం తాప్సి మంచి ఫాంలో ఉంది.తెలుగులో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న ఈ భామ ఇక్కడ మాత్రం అంత క్రేజ్ సంపాదించలేకపోయింది.

ఇక ఏ భాషలో అయినా సరైన సినిమా ఆడకపోతే ఆ ఎఫెక్ట్ మిగతా భాషల్లో కూడా పడుతుందంటుంది.మరి ఇన్ని తెలిసిన అమ్మడు మొదట ఎందుకు అన్ని ఫ్లాపులు ఫేస్ చేయాల్సి వచ్చిందో మరి.

రోజుకో కొత్త బ్యూటీ పరిశ్రమకు పరిచయమవుతున్న ఈ సందర్భంలో కేవలం అందంతోనే కాదు అభినయంతో కూడా మెప్పిస్తేనే హీరోయిన్స్ కొద్దిరోజులు ఉండగలుగుతారు లేదంటే పెట్టా బేడా సర్దేయాల్సిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube