సైబ‌ర్ నేరంలో ఏపి అధికారులు అరెస్టు కానున్నారా?

తెలంగాణ వెబ్‌సైట్‌నుంచి ఎ.పి.

 T Govt Ready To Ap Officials Arrests In Cyber Crime Case-TeluguStop.com

ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు సంబంధించి ర్యాం చోరీ చేసింద‌ని, ర్యాంకింగ్‌ కోసం ఎ.పి అడ్డదారుల్లో పయనిస్తోందంటూ తెలంగాణ సర్కారు చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందించిన‌ట్టు క‌న‌వ‌స్తోంది.ఈ విష‌య‌మై కేం ద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ .కేంద్ర వాణిజ్య శాఖ అధికారులతో చర్చించిన‌ట్టు స‌మాచారం.వెబ్‌సైట్‌ అపహరణ జరిగిన తీరుపై తెలంగాణ మంత్రి కె.టి.రామారావు లిఖితపూర్వకంగా చేసిన ఫిర్యాదు లోనిఅంశాల‌న్నీ వాస్త‌వాలేన‌ని చ‌ర్చ‌లో అధికారులు మం్ర‌తికి వివ‌రించిన‌ట్టు స‌మాచారం.కేంద్రం ఇ.ఓ.డి.బి.ర్యాంకింగ్‌ వివరాలను ప్రపంచ బ్యాంకుకు పంపనుండటంతో వివ‌రాలు సేక‌రించిన తెలంగాణ స‌ర్కారుకు 13 వ స్థానం నుంచి ఏకంగా మొదటిస్థానంలోకి ఏపి ఏవిధంగా చేరుకుందో అర్ధం కాక త‌ల ప‌ట్టుకుంది.

ఈ విష‌య‌మై ఆరాలు తీసిన టి.ప్రభుత్వం త‌మ వెబ్‌సైట్‌లోని అంశాల‌ను చోరీ చేసి ఏపి ్ర‌ప‌థ‌మ స్ధానంకు దూసుకెళ్లిన‌ట్టు గుర్తించి ఈ మేర‌కు కేం్ర‌దానికి ఫిర్యాదు చేసారు.అయితే తెలంగాణ వెబ్‌సైట్‌ను చోరీ చేయాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని, తెలంగాణ అధికారులే త‌మ సైట్‌నుహ్యాక్ చాసారంటూ ఏపి స‌ర్కారు ఎదురుదాడికి దిగింది.ఈ మేర‌కు ్ర‌ప‌భుత్వ స‌ల‌హాధారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ఇందుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డిస్తు, స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని కేంద్రాన్ని కోరారు.

కేంద్ర వాణిజ్య శాఖ మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖను సైతం సంప్రదించే అవకాశాలు వున్నాయి.సైబ‌ర్ నేరం్ర‌కింద ఏపి స‌ర్కారుపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ఎ.పి.అధికారులను ప్రశ్నించేందుకు ఏవిధంగా ముందుకు వెళ్ళాలని నా్య‌య‌నిపుణుల‌తో అధ్యయనం చేస్తున్నారు.ఈ ్ర‌క‌మంలో కొంద‌రు అధికారుల‌ను అరెస్టు చేయాల‌ని యోచిస్తున్న‌ట్టు స‌మాచారం.ప్ర‌తి చిన్న విష‌యానికి గిల్లిక‌జ్జాలు పెట్టుకోవ‌టం స‌రికాద‌ని, రు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సైబర్‌ సంఘటనతో పాటు ఇతర పలు అంశాలపై కూడా చర్చించాలని, ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube