టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేల‌ను లైట్ తీస్కొంటోన్న మంత్రులు

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో ఆధిప‌త్య పోరు, వ‌ర్గ‌పోరు ప‌తాక స్థాయికి చేరుకుంది.సీఎం కేసీఆర్ కొద్ది రోజులుగా పార్టీలో గ్రూపు రాజ‌కీయాల‌పై కాన్‌సంట్రేష‌న్ చేయ‌క‌పోవడంతో మంత్రులు వ‌ర్సెస్ ఎంపీలు, మంత్రులు వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య ఈ పోరు తీవ్ర‌మ‌వుతోంది.

 T Govt Ministers Neglecting Trs Mlas-TeluguStop.com

ఇక జిల్లాల‌కు ప్రాధినిత్యం వ‌హిస్తోన్న మంత్రుల ద‌గ్గ‌ర‌కు ఎమ్మెల్యేలు ఏదైనా ప‌నికోసం వెళితే వారు చెప్పిన ప‌నులును, చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌ను మంత్రులు చాలా చాలా లైట్ తీస్కొని ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ట‌.

ఈ కొత్త స‌మ‌స్య ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో తీవ్ర‌స్థాయిలో మంట రేపుతోంది.

ఇక పాత, కొత్త నాయ‌కుల మ‌ధ్య కూడా స‌మ‌న్వ‌యం ఉండ‌డం లేదు.ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో మంత్రులుగా ఉన్న వాళ్ల‌లో చాలా మంది టీడీపీ, కాంగ్రెస్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు.

దీంతో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీనే న‌మ్ముకుని ఉన్న నాయ‌కుల‌తో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ల‌పై, సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌పై ఈ మంత్రులు చెలాయిస్తోన్న పెత్త‌నంతో పాటు త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వాళ్ల‌కు మంట పుట్టిస్తోంది.

దాదాపు స‌గానికి పైగా ఎమ్మెల్యేలు తాము పేరుకు మాత్ర‌మే నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎమ్మెల్యేలుగా ఉన్నామ‌ని, మంత్రుల స‌హ‌కారం లేక‌పోవ‌డంతో చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌లేకపోతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు కాక ప్ర‌జ‌ల‌కు మొఖాలు చూపించ‌లేక‌పోతున్నామ‌ని…ఇలా అయితే పార్టీ ఎలా బ‌ల‌ప‌డుతుంద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

ట్విస్ట్ ఏంటంటే ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌స వ‌చ్చి మంత్రులు అయిన వాళ్ల‌లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాత్ర‌మే ఎమ్మెల్యేలు చెప్పిన ప‌నులు చేసి పెడుతున్నార‌ట‌.

వీరిద్ద‌రు మిన‌హా మిగిలిన వ‌ల‌స మంత్రులంద‌రూ ఎమ్మెల్యేల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న చ‌ర్చ‌లే టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.మంత్రుల తీరుపై ర‌గిలిపోతోన్న చాలా జిల్లాల ఎమ్మెల్యేలు వీరి వ్య‌వ‌హారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube