తెలంగాణ ప్రభుత్వం నుంచి అతి చవక ఇంటర్నెట్ .. ఎప్పటినుంచి? ఎలా?

మనిషికి మూడు అవసరాలు ఉంటాయని అంటారు.ఒకటి తిండి, రెండోది బట్ట, మూడోది ఇల్లు.

 T-fiber Internet Services To Start Before End Of 2018 – Ktr-TeluguStop.com

డబ్బు ఎలాగో అవసరమే.డబ్బు ఉంటేనేగా ఈ మూడు ఉండేది.

కాని ఈ మూడు అవసరాల మాట చాలా పాతది.డబ్బు కాకుండా, ఓ నాలుగొవ అవసరం దశాబ్దకాలం క్రితమే వెలుగులోకి వచ్చింది.

అదే ఇంటర్నెట్.ఈ కాలంలో ఇంటర్నేట్ కూడా ఓ అత్యవసరమైన అవసరం అంటే కాదనగలరా?

అసలు ఇంటర్నెట్ ఒక్కరోజు లేకపోయినా ఈ ప్రపంచం ఏమైపోతుందో ఊహించండి.ప్రపంచం దాకా ఎందుకు ఒక్కరోజు ఇంటర్నెట్ లేకపోతే మీ రోజు ఎలా గడుస్తుందో ఓసారి ఉహించుకోండి.మరి ఇంటర్నెట్ ఓ నిత్యవసర వస్తువులా మారింది కాబట్టే మన దేశంలో 45-50 కోట్ల మంది జనం స్మార్ ఫోన్లు వాడుతున్నారు.

అందులో ఇప్పుడు ఎంతలేదన్నా 20 కోట్ల మంది దగ్గర 4G మొబైల్స్ ఉండొచ్చు.చూడండి .వేగవంతమైన ఇంటర్నెట్ మన జీవితంలో ఎలాంటి భాగమై కూర్చుందో!br/>

ఈ అవసరాన్ని జియో అతి తక్కువ ధరలో తీరుస్తోంది.కాని అంతకన్నా తక్కువ ధరలో, అతి చవకగా ఇంటర్నెట్ వస్తే? త్వరలోనే మీరు ఊహించని చవక ధరల్లో ఇంటర్నెట్ సేవలు రాబోతున్నాయి.కాని ఈ సేవలు కేవలం తెలంగాణ లో నివసిస్తున్నవారికే.ఎందుకంటే ఈ సర్వీసులు ప్రారంభించేది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి.

10 జోనులు, 31 జిల్లాలు, 464 మండల్లు, 8778 గ్రామపంచాయితీలు, 10,128 గ్రామాలు, 83.58 లక్షల ఇల్లులు, 3.50 కోట్ల ప్రజలు ఈ ఇంటర్నెట్ సర్వీసులని పొందుతారు.ఈ ప్రాజెక్టు పేరే “టీ-ఫైబర్”.

ఇందులో G2G (Government to Government) మరియు G2C (Government to Citizen) సర్వీసులు ఉంటాయి.గవర్నమెంట్ టూ గవర్నమెంట్ ససర్వీసులు అంటే అన్ని గవర్నమెంటు ఆఫీసుల్లో, హాస్పిటల్స్, బ్యాంక్స్, స్కూల్లు, కాలేజీలు .అన్నిట్లో టీ ఫైబర్ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

ఇక గవర్నమెంట్ టూ సిటిజన్ సర్వీసులు పూర్తిగా ఉచితంగా ఉండకపోవచ్చు కాని, చాలా తక్కువ ధరలో, గ్రామప్రజల్లో కూడా ఇంటర్నెట్ వాడకాన్ని ప్రోత్సహించేలా ఉంటాయి.

ఈ టీ ఫైబర్ పనులు ప్రాజక్టు పనుల చకచక నడుస్తున్నాయని, 2018 ద్వితీయార్థంలో అందుబాటులోకి వస్తాయని మినిస్టర్ కేటీఆర్ ఈరోజు ఓ ప్రకటన చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube