మాజీ భర్తకు సపోర్ట్‌గా నిలిచింది

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌కు ఆయన భార్య సుజానా కొన్నాళ్ల క్రితం విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే.ప్రస్తుతం ఎవరి దారిలో వారు సాగుతూ, ఎవరి జీవితం వారే బతుకుతున్నారు.

 Sussanne Khan Support To Ex Husband Hrithik Roshan-TeluguStop.com

ఈనేపథ్యంలో హృతిక్‌ రోషన్‌కు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌కు మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.తాజాగా వీరిద్దరు అన్యోన్యంగా కలిసి ఉన్న ఒక ఫొటో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది.

ఆ ఫొటో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీరిద్దరి మధ్య గతంలో సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ జరిగిందని, అయితే అది చెడిపోయి ఇప్పుడు విభేదించుకుంటున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.

హృతిక్‌ రోషన్‌ మరియు కంగన రనౌత్‌ల గురించి పలువురు పలురకాలుగా అనుకుంటున్న నేపథ్యంలో ఆయన మాజీ భార్య సుజానే మాత్రం తన మాజీ భర్తకు సపోర్ట్‌ చేసింది.

తాజాగా ఆమె ట్విట్టర్‌లో ఈ విషయమై స్పందిస్తూ.ఆ ఫొటోలు ఫొటోషాప్‌లో మార్పింగ్‌ చేసినవి అని, తాను ఈ విషయంలో హృతిక్‌కు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లుగా సుజానే ట్విట్‌ చేశారు.

భర్త నుండి విడిపోయిన తర్వాత కూడా సుజానే ఇలా ఆయన మంచి వాడు అంటూ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.సుజానే ఆ ఫొటోలను తోసిపుచ్చడంతో అంతా కూడా ఇప్పుడు ఆ ఫొటోలు మార్ఫింగ్‌ అయ్యి ఉంటాయి అంటూ నమ్ముతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube