యేలేటి సినిమాలో తారకరత్న ట్విస్ట్ ఏంటో..!

తెలుగులో ఉన్న విలక్షణ దర్శకుల్లో కచ్చితంగా చంద్ర శేఖర్ ఏలేటి ఒకరని ప్రత్యేకంగా చెప్పాలి.ఆయన తీసినవి కమర్షియల్ సినిమాలే కాని దానిలో కథా వస్తువు చాలా బలంగా ఉంటుంది.

 Surprise Tarakaratna Twist In Eleti Manamantha Movie-TeluguStop.com

కథనే నమ్ముకుంటూ సినిమా తీసే చాలా కొద్ది మంది దర్శకుల్లో చంద్రశేఖర్ ఏలేటి ఒకరు.

ప్రస్తుతం ఏలేటి దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా మనమంతా.

మోహన్ లాల్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది.జనతా గ్యారేజ్ తో పాటుగా మనమంతాతో కూడా తెలుగులో తన సత్తా చాటాలనుకుంటున్న మోహన్ లాల్ గ్యారేజ్ సినిమా కన్నా తనే లీడ్ రోల్ చేసిన మనమంతా మీద ఎక్కువ గురి పెట్టాడు.

అయితే ఈ సినిమాలో ఎవరు ఊహించని విధంగా తారకరత్నతో ట్విస్ట్ పెట్టాడు దర్శకుడు ఏలేటి.

అసలు తారకరత్నకు ఈ సినిమాకు సంబంధం ఏంటో తెలియదు కాని సినిమాలో తారకరత్న కూడా ఉంటుందాడని అంటున్నారు.

అనడమే కాదు షూటింగ్ నుండి లీక్ అయిన ఫోటోల్లో తారకరత్న ఓ డిఫరెంట్ గెటప్లో కనిపిస్తున్నాడు.హీరోగా కెరియర్ ఎండ్ అయిన తారకరత్న ఎలాంటి రోల్ అయినా చేస్తా అని హింట్ ఇచ్చేసరికి ఆయన కోసం అవకాశాలు ఇలా వెతుక్కుంటూ వస్తున్నాయన్నమాట.

మరి మనమంతా సినిమాలో తారకరత్న ట్విస్ట్ ఏంటో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube