తెలుగు తమిళ చిత్ర సీమలో హీరో సూర్య కి ప్రత్యేక స్థానం ఉంది.రజినీకాంత్ – కమల్ హాసన్ ల తర్వాత అంతటి క్రేజ్ అక్కడ అజిత్ సొంతం చేసుకున్నారు కానీ తెలుగులో మాత్రం ఆ స్థానం సూర్య కొట్టేసాడు.
సింగం సీరీస్ తో అదరకోడుతున్న సూర్య మాస్ ఆడియన్స్ కి విందు భోజనం కోసం సిద్దం గ ఉన్నాడు.నరసింహం పాత్రలో సూర్య పలికించిన రౌద్రం.ఫెరోషియస్ పోలీస్ క్యారెక్టర్లు చేసే ఏ నటుడికైనా ఓ పాఠం అని చెప్పొచ్చు.ఈ టైపు సినిమాలు తీయడంలో తనకు తానే సాటి అని డైరెక్టర్ హరి కూడా మరోసారి రుజువు చేసుకున్నాడు.
ఇప్పుడిక ఈ జోడీ సింగం సిరీస్ లో మూడో సినిమాకు రెడీ అయిపోయింది.‘సింగం-3’ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇంకా షూటింగ్ మొదలు కూడా కాని సింగం 3 కి ఫస్ట్ లుక్ పోస్టర్ లు విడుదల చేసి ఆసక్తి రేపుతున్నారు మేకర్ లు .
సింహం రూపం లోంచి సూర్య ముఖం చొచ్చుకుని వస్తూ ఉండగా దానికి S 3 అనే పేరు ని తగిలించి సింగం 3 పోస్టర్ లు తాజాగా విడుదల చేసారు.‘యూనివర్సల్ కాప్’ అంటూ హెడ్డింగ్ కూడా పెట్టారు కాబట్టి మరొక సారి హరి – సూర్య లు ప్రపంచం మొత్తం చుట్టేయబోతున్నారు అని తెలుస్తోంది.సూర్యతో ఈ సినిమా లో అనుష్క – సృతీ హాసన్ లు హీరోయిన్ లు గా నటిస్తున్నారు.