టాలీవుడ్లో చిన్న సినిమాలకు ఇప్పుడిప్పుడే మంచి రోజులు వచ్చినట్టు కనబడుతున్నాయి.మారుతి లాంటి మూవీ మేకర్స్ చిన్న సినిమాలతో పెద్ద విజయం దక్కించుకోవడం ఎలానో చూపించే సరికి టాలెంట్ ఉన్న కొత్త వారు కూడా ఇదే దారిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ట్రైలర్ తో అందరిని ఆకట్టుకుంటున్న సినిమా పెళ్ళిచూపులు.సినిమా మొత్తం 60 లక్షల్లో కంప్లీట్ చేసిన దర్శక నిర్మాతలు సినిమాను సురేష్ బాబుకి చూపించారట.
సినిమా నచ్చి కోటిన్నరకు మొత్తం రైట్స్ కొన్న సురేష్ బాబు తన ద్వారా ఈ సినిమాను భారీ రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ నెల 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి సెంటర్స్ లో స్క్రీన్ పడేలా చూస్తున్నారట.
ముఖ్యంగా సినిమా మల్టిప్లెక్స్ లో ఎక్కువ షోస్ పడేలా చేస్తున్నాడట.మరి కోటిన్నర పెట్టిన సురేష్ బాబు ఈ సినిమాకు చేస్తున్న ప్రమోషన్ చూస్తుంటే ఎక్కువ లాభాలే పొందేలా ఉన్నాడు.
యూత్ ఫుల్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఎవడే సుబ్రమణ్యం ఫేం విజయ్ దేవరకొండ హీరోగా, రితు వర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు.