మెగాఫ్యామిలిని ఆదుకోవడం ఆయనకి అలవాటు

అల్లు అర్జున్ కెరీర్ ని రెండు భాగాలుగా విభజిస్తే రేసుగుర్రంకి ముందు, ఆ సినిమా తరువాత అని చెప్పవచ్చు.ఆ సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద ఓ మార్కు క్రియేట్ చేసుకున్నాడు బన్ని.

 Surender Reddy, The Architect Of Charan And Bunny Careers-TeluguStop.com

అంతేకాదు, మిలియన్ డాలర్ల కలెక్షన్ అమెరికాలో రాబట్టి ఓవర్సీస్ లో కూడా మార్కేట్ తెచ్చుకున్నాడు.

ఇన్నాళ్ళు అందకుండా పోయిన మిలియన్ డాలర్ క్లబ్ లోకి తాజాగా రామ్ చరణ్ కూడా చేరిపోయాడు.

రామ్ చరణ్ కెరీర్లో కూడా ధృవ నుంచి కొత్త ఇన్నింగ్స్ మొదలైంది.ఇక్కడ మీరొక కామన్ పాయింట్ గమనించాలి.

ఈ రెండు సినిమాలు తీసిందే ఒకరే … సురేందర్ రెడ్డి.

బన్నికి బాక్సాఫీస్ పుల్, చరణ్ కి ఓవర్సీస్ ఆడియెన్స్ లో ఆక్సెప్టెన్స్, ఇద్దరికి అమెరికాలో తొలి మిలియన్ డాలర్ల సినిమా .అన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చినవే.అందుకే సురేందర్ రెడ్డి అంటే మెగాఫ్యామిలికి అదోరకమైన ఇష్టం.

గీతా ఆర్ట్స్ వారు మరో సినిమా చేయమంటున్నారు .మెగాస్టార్ నుంచి కూడా ఓ సినిమా కోసం పిలుపు వచ్చింది.మొత్తానికి సక్సెస్ సురేందర్ రెడ్డి రేంజ్ పెంచేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube