జాగ్వర్ హీరోతో తెలుగు అగ్రదర్శకుల సినిమా?-Surender Reddy And Puri Jagannath To Direct Jaguar Hero? 2 months

Jaguar Hero Nikhil Kumar Puri Jagannath Surender Reddy And To Direct Hero? Photo,Image,Pics-

బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఏదైనా సాధ్యమే. రిలీజ్ కి కొన్నిరోజుల ముందు కూడా తెలుగు ప్రేక్షకులకి ఎవరో తెలియని నిఖిల్ కుమార్ తొలి సినిమా జాగ్వర్ బడ్జెట్ 75 కోట్లు. డైరెక్టర్ పెద్దపేరు కాకపోయినా, అందులో ఉన్న ఆర్టిస్టులు, ఆ సినిమా కోసం పనిచేసిన టెక్నిషియన్స్ .. అందరు పేరు మోసినవారే. కారణం, నిఖిల్ కుమార్ మాజీ కర్ణాటక సిఎం కుమారస్వామి కొడుకు, మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు కావడమే.

జాగ్వర్ మంచి ఫలితాన్ని రాబట్టుకోకపోయినా, ఇప్పుడు అదే బ్యాక్ గ్రౌండ్ తో మరో లక్కి ఛాన్స్ పట్టేసాడు నిఖిల్ కుమార్. తన తదుపరి సినిమా తెలుగు – కన్నడ భాషల్లో భారి ఎత్తున తెరకెక్కనుంది. పూరి జగన్నాథ్, సురెందర్ రెడ్డి కోసం కుమారస్వామి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇద్దరు దర్శకులు నిఖిల్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నారట.

అందులో సురెందర్ రెడ్డి సినిమా మొదట మొదలవుతుందట. ధృవ తరువాత ఈ సినిమా మొదలవ్వొచ్చు. ఇక పూరి జగన్నాథ్ తో సినిమాకి ఇంకా టైమ్ పట్టొచ్చు. పూరి ప్రస్తుతం మహేష్, ఎన్టీఆర్ కి కథలు చెప్పే పనిలో బిజీగా ఉన్నారు. ఏదైతే ఏం, కొంచెం లేట్ అవొచ్చు కాని, సినిమా అయితే ఉందిగా. మరి ఇలాంటి భారి ఆఫర్లు కొట్టేస్తున్న నిఖిల్ అగ్రహీరోల్లో ఒకరిగా ఎదుగుతాడో లేదో చూడాలి.


About This Post..జాగ్వర్ హీరోతో తెలుగు అగ్రదర్శకుల సినిమా?

This Post provides detail information about జాగ్వర్ హీరోతో తెలుగు అగ్రదర్శకుల సినిమా? was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Surender Reddy and Puri Jagannath to direct Jaguar Hero?, Surender Reddy, Puri Jagannath, Jaguar Hero, Nikhil Kumar, Dhruva

Tagged with:Surender Reddy and Puri Jagannath to direct Jaguar Hero?, Surender Reddy, Puri Jagannath, Jaguar Hero, Nikhil Kumar, Dhruvadhruva,Jaguar Hero,Nikhil Kumar,puri jagannath,Surender Reddy,Surender Reddy and Puri Jagannath to direct Jaguar Hero?,,