మోడీ అబద్దాల పాలన

ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద అబద్ధాల కోరని, అందుకే ఆయన పాలన లో ఎలాంటి స్పష్టత లేనేలేదు .ఎన్నాళ్ళని దాటవేత రాజకీయాలు పాలనను ప్రజలకు చూపుతారు ? మల్టీ మిలియనీర్లు, ఎమ్మెన్సీలు, కార్పొరేట్‌సంస్థలకు దోచిపెడుతున్నారని జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.రైతుల నుంచి భూమిని బలవంతంగా లాక్కుంటూనే, భూసేకరణ చట్ట సవరణ వల్లరైతులకు ప్రయోజనం కలుగుతుందని ప్రచారం చేయడంలో దిట్ట మోదీ అని విమర్శించారు.కేంద్రం మళ్లీ భూసేకరణ చట్టసవరణ ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో వచ్చేనెల (మే) 14న సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలు, ఆందోళనలను చేపడుతున్నట్లు ప్రకటించారు.

 Suravaram Sudhakar Reddy Controversial Comments On Pm Modi-TeluguStop.com

బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలతో పాటు, దేశానికి నల్లడబ్బును తిరిగి తీసుకురావడం, తదితర వాగ్దానాల భంగంపై ప్రజలను చైతన్యపరుస్తామన్నారు.ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ తమదేనని బీజేపీ చెబుతున్న అం శంపై స్పందిస్తూ అది వాపు తప్ప బలుపు కాదని ఎద్దేవా చేసారు .ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపట్ల దేశ వ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఢిల్లీ ఎన్నికలే నిదర్శన మన్నారు.ఏపీ నుంచి వచ్చే వాహనాలపై అంతరాష్ట్ర పన్నును వేస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు .ఏకపక్ష నిర్ణయాలు మానుకుని సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా కోరారు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube