మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్‌ల కాంబినేషన్లో ‘జులాయి’ సినిమా తర్వాత రాబోతున్న సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’.ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా ప్రమోషన్‌ను చేస్తున్నారు.ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మరియు దేవిశ్రీ ప్రసాద్‌లు ఒక ప్రమోషనల్ సాంగ్‌ను రూపొందించారు.
గతంలో వీరిద్దరు ‘జులాయి’ కోసం ఒక ప్రమోషన్ సాంగ్‌ను చేశారు.మళ్లీ ఇప్పుడు వీరిద్దరు సత్యమూర్తి కోసం ప్రమోషన్ సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
తాజాగా ఆ ప్రమోషనల్ సాంగ్ విడుదల అయ్యింది.సినిమా విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందు విడుదల అయిన ఈ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.
ఆశించినట్లుగానే బన్నీ, దేవీలు ఎనర్జిటిక్ ఫర్మార్మెన్స్‌తో ఈ పాటలో ఆకట్టుకున్నారు.కొత్త లుక్‌లో దేవిశ్రీప్రసాద్ కనిపించి తన డాన్స్ టాలెంట్‌ను మరోసారి చూపించాడు.
ఇక బన్నీ సహజంగానే స్టైలిష్‌గా కనిపించి, డ్యాన్స్‌లో తనకు సాటి లేరని నిరూపించుకున్నాడు.ఈ సాంగ్ తప్పకుండా సినిమాకు హెల్స్ అవుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు.
సమంత హీరోయిన్గా నటించి ఈ సినిమాలో అదా శర్మ మరియు నిత్యామీనన్‌లు ముఖ్య పాత్రల్లో నటించారు.రాజేంద్ర ప్రసాద్, ఉపేంద్ర, స్నేహాలు కీలక రోల్స్ చేశారు.
రికార్డులు బద్దలు చేయడం ఖాయం అంటూ ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు.