సూపర్‌స్టార్‌ ఇలా చెప్పాడేంటి?

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు మహేష్‌ ఫ్యాన్స్‌కు తీవ్రంగా ఇబ్బందిని కలిగిస్తున్నాయి.తాజాగా మీడియాతో మాట్లాడిన కృష్ణ ప్రస్తుత హీరోల్లో తనకు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు.

 Super Star Krishna Praises Prabhas-TeluguStop.com

ప్రభాస్‌లోని ఎనర్జీ మరియు యాక్షన్‌ ఎమోషన్స్‌ తనకు బాగా నచ్చుతాయంటూ కృష్ణ రెబల్‌ స్టార్‌ను తెగ పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది.దాంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతుంటే, మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ మాత్రం తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రభాస్‌ మరియు మహేష్‌బాబులకు మద్య తీవ్రమైన పోటీ ఉంది.ఆ ఇద్దరు హీరోలు కలిసి ఉన్నా కూడా వారి వారి అభిమానులు మాత్రం తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ భీరాలు పోతున్నారు.

కొన్ని చోట్ల గొడవలకు కూడా దిగుతున్నారు.ఈ నేపథ్యంలో స్వయంగా మహేష్‌బాబు తండ్రి అయిన కృష్ణ తనకు ప్రభాస్‌ అంటే ఇష్టం అని చెప్పడంతో మహేష్‌బాబు ఫ్యాన్స్‌ తల ఎత్తుకోలేక పోతున్నట్లుగా చెబుతున్నారు.

సూపర్‌ స్టార్‌ ఏంటి ఇలా చెప్పాడంటే ఫ్యాన్స్‌ కుమిలి పోతున్నారు.ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం పండుగ చేసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube