ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దోమలు దగ్గరికి రావు

దోమల బెడదకి కాలంతో సంబంధం లేదు.అయితే వర్షాకాలంలో, చలికాలంలో వీటి బెడద ఎక్కువ ఉంటుంది.

 Super Plants That Can Stop Mosquitoes-TeluguStop.com

ఇండిచుట్టు మురికిగా ఉండాలే కాని, ఎండకాలమైనా సరే, దోమలు విపరీతంగా దాడిచేస్తాయి.దోమలని ఆపేందుకు కాయిల్స్, కెమికల్స్ వాడి అదే గాలి మీరు కూడా పీల్చుకుంటున్నారు.

అదేం లాభం? అందుకే ప్రదేశాలు శుభ్రం చేసుకోని మీ ఇంట్లో ఈ మొక్కలు నాటండి, దోమలు ఏ ధైర్యంతో వస్తాయో చూడండి.

* తులసి చెట్టు కొంచెం పెద్దగా ఉంటే చాలు, దోమలు ఆటోకెటిక్ గా తగ్గుముఖం పడతాయి.

వాకిట్లో పెంచుకుంటారో ఇంట్లో పెంచుకుంటారో మీ ఇష్టం.ఇంట్లో పెంచుకోవడం ఏంటని అశ్చర్యపోయేరు .ధనవంతుల ఇంటి లోపట తులసి పెరగటం ఓ ఫ్యాషన్ మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా.

* లావెండర్ సువాసన అందరికీ ఇష్టమే.

కాని దోమలకి ఇదంటే ఇష్టం లేదు.అందుకే దగ్గరకి రావడనికి సందేహిస్తాయి.

చూడ్డానికి అందంగా ఈ మొక్కలని పెంచుకుంటే అందానికి అందం, సువాసనకి సువాసన.

* రోజ్మేరి సువాసనని మనుషులు ఎంతగా ఇష్టపడతారో, దోమల అంతకంటే ఎక్కువ అసహ్యించుకుంటాయి.

బొత్తిగా, వీటి వాసన దోమలకి పడదు.దగ్గరికి రానే రావు.

కాబట్టి రోజ్మేరి మొక్కలను పెంచుకోండి.

* సిట్రోనెల్లా దోమలకి మనుషులు అనవాళ్ళు ఇచ్చే వాసన రాకుండా అడ్డుకుంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

వాకిట్లో స్థలం ఉంటే మనుషులు ఎత్తులో పెరిగే దీన్ని పెంచుకోండి.

* ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు కాని, బంతిపూల వాసన కూడా దోమలకి పడదు అంట.అంటే కేవలం అలంకారానికి మాత్రమే కాదు, ఆల్ అవుట్ లాగా కూడా బంతి పనిచేస్తుందన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube