చిక్కుడు కాయ తింటే దొరికే సూపర్ లాభాలు

చిక్కుడు కాయ ఎంత రుచిగా ఉంటుందో ! ఓరకంగా చెప్పాలంటే ఇది వెజ్ ఐటమ్స్ లో నాన్ – వెజ్ ఐటం లాంటిది.చిక్కుడు బాగా పండి, చిక్కుడు ఇత్తులు బాగా ఉండాలే కాని, దీన్ని చికెన్ మటన్ లాగా లాగించేస్తారు చాలామంది.

 Super Benefits Of Superfood Fava Beans-TeluguStop.com

ఎందుకంటే చిక్కుడు రుచి అలాంటిది.చిక్కుడు తింటే వచ్చే లాభాలు ఎన్నో ఉన్న, ఇది అందరికి పడదు.

రెడ్ బ్లడ్ సెల్స్ లో సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించే దీన్ని తినాలో వద్దో అడగాలి.అలాగే బాగా పెరిగిన చిక్కుడు మాత్రమె తినాలి.

మన ఇంట్లో చిక్కుడు చెట్టు ఉండి, ఆ చిక్కుడు తినడమే మేలు.ఎందుకంటే చికుడు పురుగుల బారిన, ఫంగల్ ఎలిమెంట్స్ బారిన పడుతుంది.

బయట కొన్న చిక్కుడు ఎలాంటి పురుగులతో పెరిగినా అమ్మేవారు అదంతా పట్టించుకోరు.కాని మంచి చిక్కుడు మనకు దొరకాలే కాని ఇన్ని లాభాలున్నాయి.

* చిక్కుడు లో కాల్షియం, ఐరన్, మేగ్నేశియం, మంగనీజ్, ఫాస్ ఫరాస్, పొటాషియం, జింక్ లాంటి మినరల్స్ బాగా ఉంటాయి.ఇందులో ప్రోటీన్స్, కారోబోహైడ్రేట్, పెద్ద మొత్తంలో కాలరీలు కూడా ఉంటాయి.

* చిక్కుడుకాయలో సోలుబుల్ ఫైబర్ దండిగా ఉంటుంది.కాబట్టి ఇది ఇటు బ్లడ్ షుగర్ లెవల్స్ ని, అటు కొలెస్టరాల్ లెవల్స్ ని కంట్రోల్ లో పెట్టగలదు.

ఇది గుండె ఆరోగ్యాగానికి చాలా మంచిది.

* స్త్రీలు రక్తాన్ని కోల్పోతుంటారు.

అలాగే వారి ఎముకలు కోడా బలహీనంగా మారతాయి.ముఖ్యంగా గర్భిణి స్త్రీలకు రక్తం, ఎముకలలో బలం చాలా అవసరం.

ఈ అవసరాన్ని కాల్షియం, ఐరన్ ఉన్న చిక్కుడు తీరుస్తుంది.

* మతిమరుపు జబ్బుని నయం చేయడానికి డాక్టర్లు లేవోడోపో అనే కెమికల్ ని వాడతారు.

ఈ లేవోడోపో చిక్కుడు లో ఉండటం మన అదృష్టం.కాబట్టి మెదడు చురుకుదనాన్ని పెంచాలంటే, మతిమరుపు తగ్గాలంటే చిక్కుడు తినండి.

* చిక్కుడులో యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువే.కాబట్టి రోగనిరోధకశక్తిని పెంచే శక్తి చిక్కుడుకి ఉంది.

ఫ్రీ రాడికల్స్ ని తొలగించు అందాన్ని కూడా మెరుగుపరుస్తాయి చిక్కుడు ఇత్తులు.

* మంచి న్యూట్రింట్స్ ఉండి, పెద్ద మొత్తంలో కాలరీలు ఉండి, అద్భుతమైన ఫైబర్ లెవల్స్ ఉండటంతో ఇది బరువు తగ్గాలి అనుకునేవారికి ఒక అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube