సన్నీ లియోన్ ఒక పోర్న్ స్టార్ గా తెలుసు జనాలకి.తన శరీరం గురించి తెలుసు.
తను హాట్ సినిమాలు చేసిందని తెలుసు.ఐటం సాంగ్స్ చేస్తుందని తెలుసు, మన దేశంలో గూగుల్ లో అత్యధిక మంది సెర్చ్ చేసే సెలబ్రిటి అని తెలుసు.
సన్నీ లియోన్ అంటే ఇంతేనా ? కాదు, ఇంతవరకే చాలామందికి తెలుసు.సన్నీ శరీరాన్ని చూసిన ఈ ప్రపంచం, సన్నీ మనసుని మాత్రం అలా చూడకలేకపోయింది.
తానూ చేసే చారిటి గురించి పబ్లిక్ గా చెప్పుకోలేదు కాబట్టి ప్రపంచం గుర్తించలేకపోయిందో కాని, సన్నీ మనసు ఎంత మంచిదో, ఇక అందరికి తెలిసిపోయినట్టే.సన్నీ ఇకనుంచి ఓ బిడ్డకి తల్లి.
నవమాసాలు మోయలేదు.అలాంటి అవసరం తన భవిష్యత్తులో ఉంటుందో ఉండదో తెలియదు అంటోంది సన్నీ.
గర్భం దాల్చాలని ఉన్నా, తనకున్న బీజీ లైఫ్ కి గర్భం సెట్ అవుతుందో లేదో అంటోంది.అందుకే ఓ అనాథ ఆశ్రమానికి వెళ్ళింది.
అక్కడున్న పేదపిల్లలను చూస్తే తన మనసుకి నొప్పిగా అనిపిస్తోంది.కాని అందరికి సహాయం చేసే స్తోమత తనకు లేదు.
తన వంతుగా ఒక్కరికైనా సహాయం చేయాలనుకుంది, అలాగే తనకో బిడ్డ కావాలనుకుంది.అంతే, నిషా అనే 21 నెలల పాపను దత్తత తీసుకుంది.
దత్తత తీసుకోవడానికి కొన్నిరోజుల ముందు దాకా కూడా భర్తకి చెప్పలేదట.తను ఒప్పుకుంటాడో లేడో అని కాదు, తనకి సర్ ప్రైజ్ ఇద్దామని.
అంత నమ్మకం భర్త మీద సన్నీకి.ఎందుకు ఉండదు .తనని సమాజం ఎలా చూస్తుందో భర్తకి తెలుసు, అయినా ఎప్పుడు వెన్నంటే ఉన్నాడు.ఎప్పటికి ఉంటానన్నాడు.
ఈ చిన్నారికి తన పేరు, భర్త పేరు కలుపుకొని నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టింది.సన్నీ అసలు పేరు కరంజీట్ కౌర్ వోహ్ర కదా.అందులోంచి కౌర్ ని తన బిడ్డకు ఇచ్చింది.
పసిపాప అల్లరి, మాటలు అన్ని ముద్దుముద్దుగా ఉన్నాయి, కాని కేవలం ముద్దు చేసుకుంటూ కూర్చోవడం కాదు, తమపై చాలా పెద్ద బాధ్యత ఉంది, నిషాని బాగా పెంచాలి, తనకి మంచి చదువు, కెరీర్ ఇవ్వాలి, తనకి మంచి పేరు రావాలి, వచ్చేలా మేము కూడా కష్టపడాలి అంటోంది సన్నీ.
అయితే నిషాతో మాట్లాడటం కష్టంగా ఉందట.
నిషా ఇప్పుడిప్పుడే మరాఠిలో బుల్లి బుల్లి మాటలు మాట్లాడుతోందట.మరి వీరికేమో మరాఠి రాదు.
తనకి ఇంగ్లీష్ నేర్పుతాం, తనకోసం మేం కూడా మరాఠీ నేర్చుకుంటాం అంటూ మురిసిపోతోంది సన్నీ.