Home » Telugu Movie News / సునీల్ పని అయిపోయిందా ?

సునీల్ పని అయిపోయిందా ?-Sunil’s Market Falls Down Severely 2 weeks ago

అందాల రాముడు సిమిమాకి ఉన్న బజ్ వేరు. స్టార్ కామెడియన్ గా చెలమణి అవుతూ, అగ్రహీరోల తరువాత నేనే అనే రేంజ్ లో ఓపెనింగ్స్ అదరగొట్టేసాడు సునీల్. మర్యాద రామన్నకి ఉన్నట్లుగా అందాల రాముడు వెనుక ఏ పెద్ద పేరు లేదు. సునీల్ సొంత స్టామినాతో లాగిన సినిమా అది. కారణం, సునీల్ అంటే జనాల్లో అప్పుడు అదో క్రేజు.ఆ క్రేజ్ క్రమక్రమంగా తగ్గిపోతూనే వస్తోంది. జక్కన్నకి ఫర్వాలేదనిపించే ఓపెనింగ్స్ వస్తే, నిన్న విడుదలైన ఈడు గోల్డ్ ఎహే అంచనాల దరిదాపుల్లోకి కూడా రాలేదు. నాగచైతన్య ప్రేమమ్ పోటిగా ఉండటం వలనో, అసలు జనాలు సునీల్ సినిమాని పెద్దగా పట్టించుకోకపోవడం వలనో కాని, తన కొత్త సినిమాకి రెస్పాన్స్ బాగాలేదు.ఇదే రొటీన్ సినిమాలతో మరో రెండుసార్లు వస్తే, సునీల్ మార్కేట్ పూర్తిగా డౌన్ అయిపోవచ్చు. సునీల్ మనల్ని హీరోలా ఫైట్లతో కాకుండా, మళ్ళీ కామెడియన్ అలరిస్తే చూడాలని ప్రతీ తెలుగు ప్రేక్షకుడు కోరుకుంటున్నా, తన కెరీర్ మన చేతిలో లేదుగా. ఎవరి ఇష్టాయిష్టాలు, ప్రయత్నాలు వారివి.

Latest News..

Top Stories