సందీప్‌తో సమంత రొమాన్స్‌?

‘అల్లుడు శీను’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో సమంత జత కట్టిన విషయం తెల్సిందే.‘అల్లుడు శీను’ సినిమాకు దర్శకత్వం వినాయక్‌ వహించడంతో పాటు భారీ పారితోషికం ఇవ్వడంతో సమంత కొత్త హీరో అయినా కూడా శ్రీనివాస్‌తో కలిసి నటించింది.

 Sundeep Kishan To Romance Samantha-TeluguStop.com

త్వరలో మరో యువ హీరోతో నటించేందుకు సమంత ఓకే చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.మళ్లీ అవే రెండు కారణాలతో సమంత ఈ కొత్త హీరో సినిమాను ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

చిన్న హీరోగా పలు సినిమాల్లో నటించినా ఇప్పటి వరకు సరైన గుర్తింపును తెచ్చుకోలేక పోయాడు సందీప్‌ కిషన్‌.ఈ యువ హీరోతో త్వరలో వినాయక్‌ ఒక సినిమా చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

ప్రస్తుతం అక్కినేని హీరో అఖిల్‌తో చేస్తున్న సినిమా పూర్తి అవ్వగానే సందీప్‌ కిషన్‌తో సినిమా మొదలు పెట్టబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఆ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా మొదలు అయ్యింది.భారీ బడ్జెట్‌తో సందీప్‌ కిషన్‌ కెరీర్‌లోనే గుర్తుండి పోయే సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

సమంతతో రొమాన్స్‌ అయినా సందీప్‌ కిషన్‌కు స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చి పెడుతుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube