మెగా హీరో సినిమా కి 70 కోట్ల బడ్జెట్

సుకుమార్ సినిమా అంటే బడ్జెట్ 60, 70 కోట్ల పైమాటే.లవ్ స్టోరీస్ తీసి అదరగొట్టిన సుక్కు స్టార్ హీరోలతో స్టైలిష్ సినిమాలనైతే తీస్తున్నాడు కాని ఆ సినిమాలకు పెట్టిన బడ్జెట్ కు.

 Sukumar, Charan Movie Budget Fix-TeluguStop.com

కలక్షన్స్ సరితూగుతున్నాయే తప్ప లాభాలైతే రావడం లేదు.అయినా సరే స్టార్ హీరోలు సుకుమార్ సినిమా అంటే క్యూలు కడుతున్నారు.

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్న సుకుమార్ ఆ సినిమా బడ్జెట్ కూడా 70 కోట్లని చెప్పాడట.

సినిమాకు అంత బడ్జెట్ కాకుండా సింపుల్ గా కానివ్వాలని చెప్పిన చరణ్ మాటలను కూడా పక్కనబెట్టి ఈ బడ్జెట్ వేశాడట సుకుమార్.

అయితే కథా చర్చల్లో కూర్చున్నాక కాని అసలు సినిమా అర్ధం కాలేదట చెర్రికి.సినిమాను ఓ హాలీవుడ్ రేంజ్ లో తీసేందుకు అంత ఖర్చు అవుతుందని అంటున్నాడు.

అయితే చెప్పినట్టు 70 లో అయినా ఫినిష్ చేస్తాడా లేక చివర్లో మరో 5, 10 అంటూ షాక్ ఇస్తాడా అని అందరి డౌట్.ఇక ఈ సినిమాను సెప్టెంబర్ చివర్లో స్టార్ట్ చేస్తారట.

కథ పరంగా స్టార్ హీరో స్టామినా పరంగా బడ్జెట్ పెంచినా ఓకే కాని అంతకంత సినిమాలో ఆ కిక్ ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే అవకాశాలున్నాయి.అసలే చరణ్ ప్రస్తుతం రేసులో వెనుకపడి ఉన్నాడు మరి అలాంటి చెర్రి మీద మైత్రి వారు అంత బడ్జెట్ పెట్టడం ఎంతవరకు కరెక్టో వారికే తెలియాలి.

ప్రస్తుతం జనతా గ్యారేజ్ నిర్మిస్తున్న ఈ ప్రొడ్యూసర్స్ గ్యారేజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి చెర్రితో ఈ మెగా మూవీ ప్లాన్ చేశారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube