చిరు సినిమాపై బన్నీ స్పందన

మెగా స్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఆగస్టు 22న షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.

 Auto Johnny Title Not Confirmed For Chiranjeevi..?-TeluguStop.com

రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు పూరి జగన్నాధ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాకు కథను బివిఎస్‌ రవి సిద్దం చేశాడు.

ఇక ఈ సినిమా గురించి పలువురు సినీ ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.చిరు 150వ సినిమా ప్రకటన రాగానే టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు తమ స్పందన తెలియజేశారు.

తాజాగా మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఈ సినిమాపై స్పందించాడు.

చిరంజీవి 150వ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ద కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.వ్యక్తిగతంగా చిరంజీవి గారి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

మీలో ఎవరైనా ఈ సినిమాకు టైటిల్‌ను సజెస్ట్‌ చేయగలరా అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు.ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న ‘ఆటోజానీ’ టైటిల్‌ కేవలం పుకార్లు మాత్రమే అని, ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదని, బన్నీ పోస్ట్‌ ద్వారా తెలుస్తోంది.

ఈ సినిమాకు పక్కా మాస్‌ టైటిల్‌ను పెట్టేందుకు పూరి జగన్నాధ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించనున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube