సూపర్ స్టార్ ఫ్యామిలి నుంచి వెండితెరకు పరిచయమైన నటుడు సుధీర్ బాబు.ధృఢమైన దేహం, డ్యాన్స్ లో గ్రేస్ .
అన్నీ ఉన్నా సుధీర్ కి సరైన హిట్స్ లేవు.ప్రేమకథాచిత్రమ్ భారి బ్లాక్ బస్టర్ గా నిలిచినా దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు సుధీర్.
ఆడు మగడ్రా బుజ్జి ఫ్లాప్ అవడం , ఆ తరువాత సంవత్సరం గ్యాప్ ఇచ్చిన ఈ యంగ్ హీరో, మోసగాళ్ళుకు మోసగాడుతో మరో ఫ్లాప్ అందుకోగా, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఫర్వలేదు అనిపించింది.
సుధీర్ కొత్త సినిమా పేరు భలే మంచి రోజు.
నిన్నే ఈ చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన మహేష్ బాబు చిత్రాన్ని, చిత్ర యూనిట్ ఉద్దేశించి మాట్లాడారు.ఈ సంధర్భంగా సుధీర్ అంటే తనకు చాలా ఇష్టమని, చాలా కష్టపడతాడని, ఒక్క కరెక్ట్ సినిమా పాడితే చాలు, సుధీర్ స్టార్ అయిపోతాడని, ఆ ఒక్క సినిమా భలే మంచి రోజు కావాలని చెప్పుకొచ్చాడు మహేష్.
70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్, శశి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.సుధీర్ సరసన వామికా అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయమవుతోంది.వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది.