సుధీర్ బాబుకి పెళ్ళిచూపులు

సుధీర్ బాబుకి పెళ్ళి చూపులా ? అదేంటి .మహేష్ బాబు చెల్లిని ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు కదా.

 Sudheer Babu Will Be Introduced To Bollywood Today-TeluguStop.com

పైగా ఇద్దరు పిల్లలు కూడా.కొంపదీసి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా ? వామ్మో … మహేష్ బాబు దీనికి ఒప్పుకున్నాడా ? ఇలా ఏది పడితే అది ఊహించేసుకోకండి.సుధీర్ కి ఈరోజు నేషనల్ మీడియాతో పెళ్ళిచూపులు జరగనున్నాయి.

ఇంకా అర్థం కాలేదా ? “బాఘి” చిత్రంతో బాలివుడ్ కి పరిచయమవుతున్నాడు కదా ఈ కుర్ర హీరో.ఈ రోజు బాలివుడ్ మీడియాకి సుధీర్ పరిచయం చేయనుంది చిత్ర యూనిట్.సుధీర్ పరిచయ కార్యక్రమంతో పాటు, స్పెషల్ ఇంటర్వ్యూలు ఉంటాయట.

ఈ విషయాన్నే సరదాగా నేషనల్ మీడియాతో పెళ్ళిచూపులు అని చెప్పాడు సుధీర్.మరో పది పదిహేను రోజులు ముంబైలోనే ప్రమోషన్స్ లో బిజీగా ఉంటాడు ఈ కండల వీరుడు.

బాఘి లో టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు.సుధీర్ హీరోతో సమానంగా సాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

సబ్బిర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్ వాలా నిర్మించారు.ఏప్రిల్ 29న బాఘి ప్రేక్షకుల ముందుకి రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube